– ప్రజల సమస్యలకు పరిష్కారానికి నాయకులు కృషి చేయాలి
– ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే.. చాగల్లు మండల అవగాహన సదస్సులో హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి జరిగిన మంచి, వారికి అందిన లబ్దిని వివరించాలని జి సి ఎస్ కన్వీనర్లు గృహసారథులు వాలంటీర్లకు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత దిశా నిర్దేశం చేశారు. శనివారం నెలటూరులో శ్రీ సీతా రామ కళ్యాణమండపంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే అనే విషయంపై చాగల్లు మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నాయకుల, కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై అవగాహన కల్పించారు. ప్రజలెవరైనా సమస్యతో వస్తే నాయకులు వారి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. గడిచిన నాలుగున్నర ఏళ్లలో మీకు గానీ, మీ కుటుంబంలో గానీ ఎవరికైనా మంచి జరిగిందని అనుకుంటేనే మళ్లీ తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ధైర్యంగా చెప్పిన దమ్మున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఇంటివద్దకే అందించారన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కులమతాలకు, పార్టీలకు అతీతంగా నవరత్నాల పథకాలను ప్రతిఇంటికీ అందించారన్నారు. జగనన్న పాద యాత్ర సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లిస్తేనే పథకాలు అందేవని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడిన వైనం, జగనన్న పాలనలో ప్రజలు సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న వైనాన్ని బేరీజు వేసుకోవాలన్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక లోటుతో మన రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. జగనన్న అధికారం చేపట్టిన వెంటనే కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సంక్షేమంగానీ, అభివృద్ధి గాని ఆగలేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి కుటుంబానికి నేడు ఆర్థిక చేయూత లభించిందని ఆమె చెప్పారు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయపార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కానీ నేడు జగనన్న 99 శాతం అమలు చేసి చూపించాడన్నారు. మహిళా సాధికారతకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకై క నాయకుడు మన జగనన్న అని తెలిపారు. నేడు ప్రతి సంక్షేమ పథకం సొమ్ము నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లో చేరుతున్నాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మన జగనన్న అని తెలిపారు. అటువంటి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మనమంతా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ఆ తర్వాత ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఏ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా జల్లెడ పట్టి వెతికి మరీ అందించామన్నారు. నెలరోజుల పాటు నిర్వహించి జగనన్న సురక్ష ద్వారా ఉచితంగా వారికి కావాల్సిన సర్టిఫికేట్స్ ను ఉచితంగా అందించామన్నారు. అలాగే ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యాక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సచివాలయంలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల సమక్షంలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేయడం, అవసరమైన వారికి పెద్ద వైద్యానికి రిఫర్ చేయడంతో ఉచితంగా మందులు కూడా అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి, జగనన్న ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలేంటి..? పారదర్శక పాలన, సంక్షేమ పాలన తదితర అంశాలపై నాయకులు, గృహసారథులు, వాలంటీర్స్, అంతా కలిసి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. జగనన్న పేదల పక్షాన నిలబడి మన కోసం యుద్ధం చేస్తున్నారని హోంమంత్రి స్పష్టం చేశారు. పెత్తందారులకు ఉపయోగపడేది ఎవరు..? పెత్తందారుల పక్షాన నిలబడింది ఎవరో ప్రజలకు వివరించాలన్నారు. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చామన్నారు. జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, అంగన్ వాడీ స్కూల్స్ అభివృద్ది ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎవరికోసం చేశారో.. వాళ్లందరికీ ఓటు హక్కు కూడా లేదన్నారు. అంటే సీఎం పిల్లల భవిష్యత్ కోసమే అభివృద్ధి చేశారు తప్ప రాజకీయాల కోసం కాదని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ విద్య అనే ఒక ఆయుధంగా ఇస్తే, ఆ ఆయుధాన్ని ఎవరు కూడా దోచుకులేరని జగనన్న గొప్ప ఆలోచన చేశారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి కూడా అందిస్తున్నామన్నారు. నవంబర్ 9వ తేది నుంచి క్యాంపెయిన్ మొదలు అవుతుందని, నాయకులందరూ తప్పనిసరిగా పల్లెనిద్ర చేయాలన్నారు. రాత్రి సమయంలో పల్లెనిద్ర క్యాంపులను తాము ఆకస్మికంగా తనిఖీలు చేస్తామన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తున్నామన్నారు. అందరికీ సేవ చేయడమే తమ కర్తవ్యంగా నాయకులు ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో ప్రతిపక్షాలు అన్నీ కలిసి అబద్ధపు హామీలతో, కలబొల్లి మాటలతో ప్రజల ముందుకు వస్తారని ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలన్నారు. జగనన్నే మా నమ్మకం జగనన్నే మా భవిష్యత్తు అని అందరికీ తెలియజేస్తూ.. ఇప్పటివరకు నాలుగున్నర సంవత్సరాలుగా మనం పొందిన మేలు ఇంకా పొందాలంటే కచ్చితంగా ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని హోంమంత్రి తానేటి వనిత దిశా నిర్థేశం చేశారు. ఈ కార్యక్రమంలో చాగల్లు మండలంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, సచివాలయ కన్వీనర్స్, గృహసారధులు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News