
-తెలుగు రాష్ట్రాల్లోనే ప్రప్రధమం
-అత్యాధునిక హైబ్రేడ్ క్యాతల్యాబ్ ప్రారంభం
-ప్రత్యేక ఆకర్షణగా ఇండియన్ యాక్టర్స్ కుమారి అనీషా ముఖర్జి
-వేడుకగా చిరంజీవి హాస్పటల్ తొలి వార్షికోత్సవం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
గత సంవత్సరం క్రితం కూకట్‌పల్లిలో వెరికోజ్ వెయిన్స్‌కు ప్రత్యేక చికిత్సా కేంద్రంగా రూపొందించిన చిరంజీవి హాస్పటల్ నేడు తొలి వసంతోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ప్రఖ్యాత వ్యాస్క్‌లర్ సర్జన్ డాక్టర్ కె.సంజీవరావు, డెర్మటాలజిస్టు డాక్టర్ పి.శిల్ప నేడు జరిగిన కార్యక్రమంలో తెలిపారు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీలోని హోటల్ వైష్ణవి గ్రాండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా 5వేలు వెరికోజ్ వెయిన్స్ సర్జరీలు విజయవంతం పోస్టరును ఆవిష్కరించారు. అనంతరం చిరంజీవి హాస్పటల్ ఛైర్మన్ డాక్టర్ కె.సంజీవరావు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో వెరికోజ్ వెయిన్స్ చికిత్సలు అందించే ఆసుపత్రి తమదే అన్నారు. సంవత్సర కాలంలో ఐదు వేల మందికిపైగా విజయవంతంగా శస్త్ర చికిత్సలు అందించడం తమకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనీషా ముఖర్జి మాట్లాడుతూ, డాక్టర్ కె.సంజీవరావు సేవలు అమోఘమని ఆయన తమ సేవలను పేద ప్రజలకు కూడా అంకితం చేశారని పేర్కొంటూ అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని అభిలషించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పింజల రామకృష్ణ, డాక్టర్ హరికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దివంగత సినీ నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంష్ శ్రీహరి మాట్లాడుతూ, డాక్టర్ సంజీవరావుతో తమ కుటుంబానికి అభినాభావ సంబంధం ఉందన్నారు. వారి పిలుపు మేరకు కార్యక్రమానికి హాజరయ్యామన్నారు. సంజీవరావు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న బిగ్‌బాస్ షానీ సాల్మన్ మాట్లాడుతూ, సంజీవరావు ఎంతో ప్రతిభావంతులైన వైద్యులని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందిస్తున్న వైద్య సేవలు అపూర్వమన్నారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్ భార్గవి వినాయక్, సినీ నటీమణులు డింపుల్ ప్రియాంక, చందు, డైరెక్టర్ సర్కార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News