Breaking News

ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల్లో కమిటీలు

-ప్రజా, జర్నలిస్ట్ సంఘాలకు ఆహ్వానం
-ప్రజాస్వామ్యం గెలవాలంటూ బహిరంగ ప్రకటన

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 6-7 విడుతల్లో ఎన్నికలు జరుగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో కమిటీలను వేయాలని నిర్ణయించినట్లు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరావులు నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

దేశవ్యాప్తంగా జరగనున్న వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో ప్రజలు తమ ఓటును అమ్ముకోకుండా చైతన్యం కలిగించేందుకు, అదేవిధంగా రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం ఇతర వస్తువులతో ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తమ వేదిక ద్వారా ప్రయత్నం చేస్తున్నామని, దీనికి ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని వారు కోరారు. దేశంలో ముందు ముందు ఎన్నికలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను అపహస్యం చేసే విధంగా ఓట్ల వ్యాపారం నడుస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతం చేసి ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగే అక్రమాలను ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి తీసుకురాచ్చని, లేదంటే ఎన్నికల కమీషన్ ఇచ్చిన సీ విజిల్, 1950 ఫోన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వారు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *