Breaking News

రాజకీయ లబ్దికోసం ఊసరవెల్లి రాజకీయాలు తగదు… : డాక్టర్‌ జాన్‌ బెన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
షర్మిళ వ్యాఖ్యలను అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఖండిరచింది. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ జాన్‌ బెన్ని మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసం షర్మిళ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోందన్నారు. మొరుసుపల్లి షర్మిల శాస్త్రి ఊసరవల్లి లాగా రంగులు మారుస్తూ నీ భర్త అనిల్‌కుమార్‌ వేసే వేషాలు రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు. స్థాయికి దిగజారి మాట్లాడే మాటలు మానుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున ఇబ్బంది పడటానికి గల కారణం కాంగ్రెస్‌ పార్టీ కాదా అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల, అనిల్‌కుమార్‌ని నమ్ముకున్న క్రైస్తవులను నడి సముద్రంలో ముంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయారని చెప్పారు. మీకు మణిపూర్‌ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడే హక్కు మీకు లేదు. అక్కడికి మేము మా టీం వెళ్ళి అక్కడ ప్రజలు ఎంతోమందిని ఆదరించి వచ్చామన్నారు. ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెనక ఉన్నారని, నీ మాయ మాటలు ప్రజలు నమ్మరని చెప్పారు. సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పే ఇక్కడికి రావాలి ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు, పాస్టర్‌ బాలస్వామి, దళిత జెఎసి రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు నాగేశ్వరావు, పాస్టర్‌ కే.ప్రకాష్‌రావు, స్థానిక పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *