తెలంగాణ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడు దలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల కు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ చూసుకోవచ్చు.ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహిం చిన విషయం తెలిసిందే.ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యా ర్థులు హాజరయ్యారు.వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికి పూర్తిచేశారు.
Tags hyderabad
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News