-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల బరిలో పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైన నేపథ్యంలో నోడల్ అధికారులు వారి సంబంధిత విధులను సమర్థవంతంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు, టైం లైన్ మేరకు పూర్తి సన్నద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ నోడల్ అధికారులతో మాట్లాడుతూ ముందుగా ఈవిఎం సప్లిమెంటరీ ర్వాండమైజేషన్ రేపు పక్కాగా చేపట్టాలని, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు మే ఒకటి నుండి ఆరు వరకు పంపిణీ, ఈవిఎం సెకండ్ ర్వాండమైజేషన్ మే 1 న ఆర్ఓ ల పరిధిలో జరగాలని, ఈవిఎం కమిషనింగ్ మే 3, 4 తేదీలలో నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. హోం ఓటింగ్, ఈటిపీబిపీఎస్ తదితర అంశాలపై దిశా నిర్దేశం చేసారు. ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News