విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాల చేపట్టిన సహాయక చర్యల్లో సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. విజయవాడ నగరంలోని 62వ డివిజన్లోని ఎల్బీఎస్ నగర్, పటేల్ నగర్, లక్ష్మీ నగర్, ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్, రాదా నగర్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిబ్బందికి గుంటూరు నగర కమిషనర్ తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనుల కోసం వివిధ మున్సిపాలిటీల నుండి హాజరైన కార్మికులు, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. కార్మికులకు డివిజన్లో కేటాయించిన ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టేలా పర్యవేక్షణ అధికారులు చూడాలన్నారు. పారిశుధ్య పనుల్లో భాగంగా ప్రజారోగ్య సిబ్బంది వరదలకు నిలిచిన వ్యర్ధాలను తొలగించాలని, అలాగే వరద తగ్గిన ప్రాంతాల్లోని నివాస ప్రజల ఇళ్లల్లో ఉన్న వ్యర్ధాలను కూడా సేకరించాలని ఆదేశించారు. రోడ్ల మీద వ్యర్ధాలు ఉండడానికి వీలు లేదన్నారు. అలాగే విధులకు హాజరైన సిబ్బంది, కార్మికులకు మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Tags guntur
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …