గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పీకలవాగు మీద ఆక్రమణలను ఇంజినీరింగ్ మరియు పట్టణ ప్రణాలిక అధికారులు సంయుక్తంగా పర్యటించి, గుర్తించిన వాటిని తొలగించడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక విభాగం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో అవుట్ ఫాల్ డ్రైన్స్ లో పీకలవాగు ప్రధానమైనదని, దీని మీద ఆక్రమణల వలన వర్షాకాలం డ్రైన్ ఓవర్ ఫ్లో జరిగి చుట్టుపక్కల …
Read More »Tag Archives: guntur
ప్రజల నుండి అందే ఫిర్యాదులు లేదా ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే ఫిర్యాదులు లేదా ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని గడువులోపు పరిష్కరించని అధికారుల పై చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ స్పందన అర్జీలను సమగ్ర సమాచారం, మరియు పరిష్కారాలతో నిర్దేశిత గడువులోగా క్లోజ్ చేయాలని, అర్జీదారులకు ఇచ్చే …
Read More »207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న39 వార్డు వాలంటీర్ల పోస్టులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న39 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.19-6-2022న అన్ని వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను నోటీసు బోర్డుల యందు ప్రచురించడమైనదని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి …
Read More »పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలని, రోడ్ల మీద, కాలవల్లో వ్యర్ధాలు వేసే షాప్స్ ని సచివాలయాల వారీగా గుర్తించి సీజ్ చేయాలని ప్రజారోగ్య అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ సాంబశివపేట, కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, మణిపురం తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయాల వారీగా …
Read More »జూలై 1 నుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్ధ పరిధిలో జూలై 1 నుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధము పటిష్టంగా అమలు చేస్తామని, ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ గారు కోరారు. బుధవారం కమిషనర్ ఆదేశాల మేరకు పట్నం బజార్, చేపల మార్కెట్, లాలాపేట పూలు మరియు పండ్ల మార్కెట్ ప్రాంతాల్లో ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు అవగాహన …
Read More »18 అడుగుల ఏకశిలా వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ నిర్వహణలో, శ్రీమాన్ గ్రంధి కాంతారావు ఆధ్వర్యములో, గుంటూరు పట్టణ సమీపమున వెంగళాయపాలెం- అంకిరెడ్డి పాలెం ప్రధాన రహదారి నందు నూతనముగా నిర్మించబడిన 18 అడుగుల ఏకశిలా వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్టా కార్యక్రమాలలో 6. 6. 2022 రోజున శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు ఈ ఆలయంకు విచ్చేసి , ఆలయంను దర్శించి , భక్తులకు మంగళాశాసనం అందించారు.
Read More »శ్రీ చక్ర వేదాధ్యయన శిక్షణా తరగతులు ప్రారంభం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద శ్రీ చక్రాలయంలో శ్రీ చక్ర వేదాధ్యయన శిక్షణా తరగతులను శ్రీశ్రీశ్రీ విశ్వంభరానంద గిరిస్వామి ప్రారంభించారు. సోమవారం ఉదయం శ్రీ మహాగణపతి శ్రీ కుమార స్వామి సహిత శ్రీ చౌడేశ్వరి చంద్రశేఖర సమన్విత శ్రీ చక్రాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రధానంగా అర్చకులకు వారానికి రెండు రోజులపాటు అనగా బుధ, శుక్ర వారాలలో ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం …
Read More »గుంటూరు శ్రీ చక్రాలయంలో శ్రీ చక్ర వేదాద్యయన శిక్షణా తరగతులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో తొలిసారిగా గుంటూరు, నల్లపాడు రోడ్ సాయినగర్‌లో 23కోట్ల శ్రీవిద్యాబీజాక్షరములు నిక్షిప్తం చేయబడి, 20 అడుగుల ఎత్తులో నిర్మించిన స్థూపంపై 2 అడుగుల శ్రీచక్రం ప్రతిష్ఠించబడిన శ్రీ మహాగణపతి శ్రీ కుమార స్వామి సహిత శ్రీ చౌడేశ్వరీ చంద్రశేఖర సమన్విత శ్రీ చక్రాలయంలో సోమవారం ఉదయం శ్రీచక్ర వేదాద్యయన శిక్షణాతరగతులకు శ్రీకారం చుట్టబడుతున్నది. ప్రధానంగా అర్చకులకు వారానికి 2రోజులు బుధ, శుక్రవారాలలో ఈ తరగతులు నిర్వహించబడతాయి. కారంచేడులోని శ్రీ వశిష్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ప్రణవానంద గిరిస్వామి …
Read More »విద్యుత్ కోతలకు అంతం లేదా?
-ఆసుపత్రుల్లో రోగులను పట్టించుకోరా -పరీక్షల వేళా విద్యుత్ కోతలు -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ కోతలతో అంధకార ప్రదేశ్ గా మారుస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఆరోపించారు. వేళాపాళా లేని విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నా విద్యుత్ కోతలు సరి కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన …
Read More »గుంటూరు పిఎఫ్ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 జయంతి ఉత్సవాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ న్యాయవాది ఇది డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మరో 200 సంవత్సరాల వరకు ఈ భారత దేశానికి ఎలాంటి డోకా లేని రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. ఉన్నత చదువులు చదివిన దేశంలో కుల వర్ణ వివక్ష రూపుమాపడానికి శ్రీకారం చుట్టారంటూ… పిఎఫ్ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకల్లో పలువురు వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా రాజేశ్వరి రాజేష్ రీజినల్ పిఎఫ్ కమిషనర్ మరియు …
Read More »
Prajavartha Online Telugu News