-పునరావృత అర్జీలకు జిల్లా అధికారులదే బాధ్యత.. -సమస్యను స్పష్టతతో శాశ్వత పరిష్కారం చూపండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను సమగ్ర సమాచారంతో, ఆర్జీదారుడి సంతృప్తే లక్ష్యంగా స్పష్టతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను అదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పేజీఆరఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. …
Read More »Tag Archives: vijayawada
సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా తేళ్ల కస్తూరి సోమవారం (జూన్ 1 న) స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. పూర్వపు సెక్రెటరీ మణిరామ్ రిటైర్మెంట్ కారణంగా ప్రస్థుతం జోన్ 3 జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న తేళ్ల కస్తూరి కి ‘సెక్రెటరీ’ గా పూర్తి అదనపు బాధ్యతలు కల్పిస్తూ సమాచార శాఖ డైరెక్టర్ ఉత్తరువులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తరువుల ను అనుసరించి సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా …
Read More »సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ తో మర్యాద పూర్వక భేటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధ్యతల స్వీకరణ అనంతరం సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ తేళ్ల కస్తూరి అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా అకాడమీ చేపట్టిన గ్రామీణ విలేఖరుల శిక్షణా తరగతులు గురించి చర్చించారు. అకాడమీ కార్యక్రమాలను విజయవంతం చేసేలా ఉద్యోగుల సమన్వయ పరిచి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ మేనేజర్ ఎం. భాస్కర నారాయణ,డి.పి .ఓ ఎం. లోవరాజు, చైర్మన్ పి .ఎస్ శ్రీనివాస జీవన్, ఇతర సిబ్బంది …
Read More »లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లు అందజేస్తున్న సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ అన్నారు. పింఛన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి నివాసాల వద్దనే సకాలంలో పింఛన్లు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నగరపాలక సంస్థ మూడు సర్కిళ్ల పరిధిలో మొత్తం 64,967 పింఛన్లకు గాను 53,946 …
Read More »ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా …
Read More »సుస్థిర నగరాల నిర్మాణానికి విజయవాడ వేదిక
-యునిడో SCIAP ముగింపు సదస్సు ఘనంగా ప్రారంభం -దేశవ్యాప్తంగా పాల్గొన్న పట్టణాభివృద్ధి నిపుణులు, మున్సిపల్ కమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO), గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ (GEF), కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ (SCIAP)” ముగింపు సదస్సు సోమవారం …
Read More »సింగపూర్ ఓపెన్‌లో స్వర్ణ చరిత్ర సృష్టించిన సాత్విక్ సాయిరాజ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ మరోసారి భారత క్రీడా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. సింగపూర్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో సింగపూర్ వేదికపై భారత బ్యాడ్మింటన్‌కు అరుదైన గౌరవాన్ని తీసుకువచ్చారు. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామితో కలిసి …
Read More »బీసీలకు చట్టసభల్లో 52% రిజర్వేషన్లు కల్పించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీలకు చట్టసభల్లో 52% రిజర్వేషన్లు కల్పించాలి అని డిమాండ్ చేస్తూ ఈనెల 16న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు తెలిపారు. ఆదివారం విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగించల చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో లాకా మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, వారి హక్కుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి …
Read More »ఘనంగా విశ్వబ్రాహ్మణ సంఘం 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, జనాభాలో ఐదు శాతంగా ఉన్న విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయమే జరుగుతోందని తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధు సూదనాచారి ముఖ్యఆతిదిగా నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా …
Read More »ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు సోమవారం కూడా కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. విదర్భ మీదుగా ఉత్తరాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి విస్తరించి ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో సోమవారం (01-06-2026) అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు …
Read More »
Prajavartha Online Telugu News