Breaking News

Tag Archives: vijayawada

ఈనెల 3న బహుజన మాట- పాట సాంస్కృతిక చైతన్య కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ద్రావిడ ఉద్యమనేత ముత్తువేల్ కరుణానిధి 103వ జయంతి సందర్భంగా బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 3న బహుజన మాట- పాట అనే సాం స్కృతిక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బీసీ చైతన్య వేదిక ప్రతినిధులు వీరవల్లి శ్రీనివాస్, పానుగుపాటి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, ఐఏఎస్ మాజీ అధికారి పీవీ …

Read More »

ఆంధ్రరత్నభవన్లో నీలం సంజీవరెడ్డి వర్ధంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజకీయ చరిత్రలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, లోక్ సభ స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అధిరోహించిన ఏకైక వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని ఏపీ సీసీ ఉపాధ్యక్షుడు వి.గురునాథం, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రరత్నభవన్లో సంజీవరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పని చేశారని కొనియాడారు. ఆయన …

Read More »

లేపాక్షి ఉద్యోగుల జీతాల పెంపుపై హర్షం – హరిప్రసాద్ కి ఉద్యోగుల ఘన సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి షోరూమ్‌లలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మూల వేతనంపై 10% హైక్ మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై లేపాక్షి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని లేపాక్షి కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారిని లేపాక్షి ఉద్యోగులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, లేపాక్షి కేవలం …

Read More »

కూటమి ప్రభుత్వo లో ప్రతి గడపకు పెన్షన్ – ఎంపీ చిన్ని

-“టిడ్కో ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ చిన్ని పాల్గొన్నారు రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని, ప్రతి అర్హుడికి గౌరవప్రదంగా పెన్షన్లు అందేలా ప్రభుత్వం …

Read More »

ఎన్డీఏ కార్యాలయంలో తొమ్మిదో రోజు ప్రజా దర్బార్ కు విశేష స్పందన

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో తొమ్మిదో రోజు కూడా నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, టీడీపీ, బీజేపీ ,జనసేన నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓ సీ ను సోమవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, కూటమినేతలతో కలిసి అందజేశారు. 55 వ డివిజన్ వించిపేటకు చెందిన దేవకుమార్ ( 68) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో ఎల్ వో సి కొరకు …

Read More »

ఘనంగా pre-convaction (ఫ్రీ కాన్వికేషన్) వేడుకలు

-అవార్డు గ్రహీతలను అభినందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 29వ, 30వ స్నాతకోత్సవ వేడుకలు విజయవాడలో మంగళవారo జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో సోమవారం రాత్రి “pre convocation” సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. దీనికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీనియ‌ర్ కార్డియాల‌జిస్ట్‌ డాక్టర్ సి.నరసింహన్, పి. సి. రాత్ ( విశ్వవిద్యాలయ డాక్టర్ ఆఫ్ సైన్స్ స్ ) అవార్డు …

Read More »

అభివృద్ధి పనుల్లో జాప్యం అంగీకరించేది లేదు : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-విజయవాడ కార్యాలయంలో నాలుగు మండలాల అధికారులతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమీక్ష సమావేశం -నియోజకవర్గ అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చ -అభివృద్ధి పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు -ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచన -పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం సహించబోమని అధికారులకు హెచ్చరిక -ప్రభుత్వ హామీల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన -బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రతి అధికారి …

Read More »

నగరంలో ఈనెల 7న బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చా గోష్ఠి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ సామాజికవర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు ఈనెల 7వ తేదీన విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ వేద విజ్ఞాన పరిషత్ వెల్లడించింది. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో పరిషత్ చైర్మన్ డి.వి. బాలసుబ్రమణ్యం, ప్రముఖ న్యాయవాది చుండూరు సుందర రామశర్మ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్యాంశాలు…నిష్పాక్షిక వేదిక ఈ సమావేశానికి …

Read More »

ఆత్మీయ పలకరింపు ఆర్థిక భరోసా లతో అనందహేళ..

-తొలిపొద్దులోనే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పంపిణీ.. -జిల్లాలో 2,25,887 మంది లబ్ధిదారులకు రూ. 99 కోట్ల పంపిణీ.. -సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. డా.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సామాజిక ఆర్థిక భద్రత, జిల్లా కలెక్టర్ ఆత్మీయ పలకరింపులతో లబ్దిదారుల కళ్లలో ఆనందాన్ని నింపాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెలా ఒకటో తేదీనే అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. సామాజిక భద్రత …

Read More »