Breaking News

Tag Archives: vijayawada

నున్నలో పేద విద్యార్థుల కోసం ఆశాదీపం

-భారీ హాస్టల్ భవన నిర్మాణానికి ముమ్మర సన్నాహాలు -అనుమతుల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తా -ఎంపీ సానా సతీష్ బాబు హామీ -పేద విద్యార్థుల కష్టాలను గమనించాం.. నాణ్యమైన వసతి కల్పనలో వెనక్కి తగ్గేదే లేదు: -మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ -విద్యార్థుల వసతి సమస్యలకు చెక్: రాయల్ సర్వీస్ ట్రస్ట్ సేవలపై వెల్లువెత్తిన ప్రశంసలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడ వంటి నగరాలకు ఉన్నత చదువుల కోసం వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థుల వసతి సమస్యలను …

Read More »

అడిష‌నల్ డైరెక్ట‌ర్ పి.కిర‌ణ్ కుమార్‌కు ఘ‌న వీడ్కోలు

– సీఆర్ మీడియా అకాడ‌మీ త‌ర‌ఫున ప‌ద‌వీ విర‌మ‌ణ శుభాకాంక్ష‌లు – స‌మాచార శాఖ‌కు విశిష్ట సేవ‌లు అందించిన అధికారి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ డైరెక్ట‌రేట్‌లో అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ (ఏడీ)గా విధులు నిర్వర్తించి ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న పి.కిర‌ణ్ కుమార్‌ను సీఆర్ మీడియా అకాడ‌మీ త‌ర‌ఫున మేనేజ‌ర్ ఎం.భాస్క‌ర్ నారాయ‌ణ, సిబ్బంది శుక్ర‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. డైరెక్ట‌రేట్ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో పి.కిర‌ణ్ కుమార్ …

Read More »

డీఎమ్ఈ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ఎ. విష్ణు వర్ధన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య విద్యా శాఖ నూతన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)గా డా. ఎ. విష్ణు వర్ధన్ శుక్రవారం అధికారికంగా పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగంణంలో గల డీఎమ్ఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ ఎ. విష్ణు వర్ధన్ ఎం.డి (అనస్థీషియాలజీ) పూర్తి చేసి వైద్య విద్యా రంగంలో విశేష అనుభవం సంపాదించారు. ప్రస్తుతం కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధి, వైద్య సేవల మెరుగుదల కోసం అనేక విధాలుగా కృషి …

Read More »

టెక్స్ టైల్స్ హబ్ గా ఏపీ

-కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ -నార ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం -2030 నాటికి 350 బిలియన్ డాలర్ల టెక్స్ టైల్స్ ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యం -బ్రాండింగ్ మాస్టర్ చంద్రబాబు -మోడి, చంద్రబాబు విజనరీ లీడర్లు : కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ -డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏపీలో అభివృద్ధి పరుగులు : మంత్రి సవిత -గత ప్రభుత్వం రప్పా రప్పా తీసుకొస్తే… -కూటమి ప్రభుత్వం టెక్స్ టైల్స్, అపెరల్ పాలసీకి శ్రీకారం చుట్టింది -చేనేత, హస్త కళాకారులకు 365 రోజుల పాటు …

Read More »

0-6 ఏళ్ల చిన్నారుల ఆరోగ్య పరీక్షలకు ‘ఏఐ’ సాంకేతికత – రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు

-మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. సూర్యకుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని 0-6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల ఆరోగ్య, అభివృద్ధి స్థితిని అత్యంత ఖచ్చితత్వంతో, వేగవంతంగా గుర్తించేందుకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వినూత్న చర్యలు చేపట్టిందని ఆ శాఖ కార్యదర్శి ఏ. సూర్య కుమారి తెలిపారు. చిన్నారులకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ఆరోగ్య స్క్రీనింగ్ నిర్వహించేలా అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ …

Read More »

ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ. మరియు మొక్కలు నాటే కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిని దృష్టిలో ఉంచుకొని, సామాజిక బాధ్యతగా ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 65 రోజులుగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. విఎంసి కార్పొరేషన్ వద్దనున్న ప్రకృతి వనంలో శుక్రవారం 66 వ రోజు నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. …

Read More »

సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాధుర్‌కు ఏపీ ఛాంబర్స్ అభినందనలు

-ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ కోస్తా రైల్వే) జోన్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాధుర్‌కు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) అభినందనలు తెలిపింది. ఈ కొత్త జోన్ ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి కొత్త శకానికి నాంది పలుకుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సందీప్ మాధుర్‌కు సమర్పించిన ఒక వినతిపత్రంలో, జూన్ 1, 2026 నుండి …

Read More »

చేసేపనిలో బహుముఖ ప్రజ్ఞాశాలి

-సర్వీసు రూల్స్ పై అపార అనుభవం ఆయన సొంతం -సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశేష సేవలు అందించిన పి. కిరణ్ కుమార్ శాఖకు ఒక ఆదర్శమని డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్ అన్నారు. శుక్రవారం విజయవాడ ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు పి. కిరణ్ కుమార్ పదవీ విరమణ …

Read More »

దోష ర‌హిత ఓట‌ర్ల జాబితా ధ్యేయంగా స‌ర్‌..

– ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు ఆరోగ్య‌క‌ర ఓట‌ర్ల జాబితా కీల‌కం – అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం.. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడ‌టం స‌ర్ ప్ర‌క్రియ ప్రాథ‌మిక ఉద్దేశం – క్షేత్ర‌స్థాయిలో ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, బీఎల్‌వో సూప‌ర్‌వైజ‌ర్ల పాత్ర ముఖ్యం – స‌ర్ స్ఫూర్తికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది నిబ‌ద్ధ‌త‌తో సేవ‌లందించాలి – ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) కార్య‌ద‌ర్శులు సంతోష్ కుమార్ దూబే, న‌వీన్ కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ …

Read More »

జూన్ 2న డాక్టర్ డా.ఎన్.టీ.ఆర్ హెల్త్ యూనివర్సిటీ 29, 30వ కాన్వకేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ 29, 30 వ వార్షిక కాన్వకేషన్ ను జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సంయుక్తంగా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ముఖ్య ప్రసంగం చేయడంతో …

Read More »