-ఇళ్ల లబ్దిదారుల ముఖాల్లో వికసిస్తున్న ఆనందం… -కొండంత సంబరంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులు… – జిల్లాలో జగనన్న కాలనీలలో జోరందుకున్న స్వగృహ నిర్మాణాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు స్వంత ఇల్లు సమకూర్చాలన్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు క్రింద వై.యస్.ఆర్. జగనన్న కాలనీల్లో పేదల స్వంత ఇంటికల నెరవేర్చేందుకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. జిల్లాలోని పక్కా గృహాలు లేనివారందరికీ జగనన్న కాలనీల్లో పట్టాలిచ్చి త్వరితగతిన గృహాలు నిర్మించి …
Read More »Tag Archives: vijayawada
విజయవాడ కేంద్రంలో ఐఏఎస్ అకాడమీ ఏర్పాటు కావడం సంతోషదాయకం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ విజయవాడ నగర కేంద్రంలో యువతకు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీ తోటవారి వీధిలో విజయదర్శని ఐఏఎస్ అకాడమీని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఒకప్పుడు ఐఏఎస్ కోచింగ్ అంటే హైదరాబాద్, బెంగుళూరు వెళ్లవలసి ఉండేదని.. ఆ ప్రాంతాలకు ధీటుగా …
Read More »గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, విజయవాడ చిరంజీవి యువత అధ్యక్షులు కటికి రాకేష్ నాథ్ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, భానునాగర్, శ్రీనగర్ కాలనీ, గులాబితోట లో కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో, 45 వయస్సు పైబడిన 2000 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు …
Read More »అర్హులందరికీ “నేతన్న నేస్తం”…
-ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు -ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక -చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు, ఉత్పత్తి ధరలకే విక్రయాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం అర్హులైన ప్రతి నేత కార్మికుడికి చేరాలని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు అన్నారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో శనివారం చేనేత జౌళిశాఖ సంచాలకులు పడాల అర్జునరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నేతన్న నేస్తం లబ్ధిదారుల …
Read More »సబ్ కలెక్టర్ జి. ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టరు విజయవాడ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్. శనివారం విజయవాడ వాంబే కాలనీ లోని 262- వార్డు సచివాలయం మరియు న్యూ ప్రకాష్ నగర్ 268, 269 వార్డు సచివాలయములను ఆకస్మికముగా తనిఖీ చేసారు. తనిఖీలో సచివాలయముల యందు సరి అయిన ప్రదేశములో అందరకు కనపడునట్లు డిస్ ప్లే బోర్డులు వుంచగలందులకు , అందరు వాలంటీర్ సిబ్బంది, సరియైన నిర్ణీత వస్త్రధారణ, సచివాలయం సిబ్బంది , సచివాలయం వదలి వెల్లునప్పుడు, మరియు వారి ఇన్ …
Read More »కాపులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద పీట వేసింది వై.యస్. కుటుంబం మాత్రమే…
-సియం వైయస్. జగన్ రెండేళ్లలో కాపుల సంక్షేమానికి రూ. 12 వేల కోట్లు మంజూరు చేశారు. -కీ.శే. వంగవీటి మోహనరంగా ఆశయాల స్పూర్తితో ముందుడుగు వేయండి.. -రాష్ట్ర మంత్రులు పేర్నినాని, కె.కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లక్షకోట్ల రూపాయలు లబ్దిదారుల ఖాతాలకు ప్రభుత్వం జమచేసిందని ఇది సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి …
Read More »ఇంతవరకు 4.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం… : జెసి డా. కె. మాధవీలత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు భాగంగా 34,675 రైతుల నుంచి 4,05,468 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 4గురు రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 34,675 మంది రైతుల నుంచి రూ. …
Read More »వరద హెచ్చరికలతో అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్…
-కృష్ణానదికి చేరనున్న వరద నీరు… -లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానదికి భారీ వరద నీరు చేరనున్న దృష్ట్యా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుండి ఆయన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు భారీగా వస్తోందని జిల్లా కలెక్టర్ అధికారులతో చెప్పారు. శ్రీశైలం నుంచి సుమారు 5.58 లక్షల …
Read More »ఆగష్టు 14 వరకూ రాత్రి కర్ఫ్యూ పొడిగింపు… : కలెక్టరు జె.నివాస్
-రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అమలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జిల్లాలో ఆగష్టు 14 వరకూ రాత్రి కర్ఫ్యూనూ పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 14 వరకూ ప్రతీరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా ఇతర సేవలకు అనుమతి లేదన్నారు. కోవిడ్ నియంత్రణలో …
Read More »కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది… : మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. శనివారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కోవిడ్ మూడవ వేవ్ సన్నద్ధత పై నగరంలోని వైద్యాధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ కూడా కోవిడ్ కేసులను నియంత్రించేందుకు నిత్యం సమీక్షిస్తున్నారన్నారు. అలాగే పరిమితులు లేకుండా నిధులు, వైద్య సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారన్నారు. కేరళ రాష్ట్రంలో …
Read More »
Prajavartha Online Telugu News