Breaking News

Tag Archives: vijayawada

పింఛన్ల గూర్చి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-28వ డివిజన్ లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ వ్యవస్థను సరళీకృతం చేసిన ఘనత ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు అన్నారు. 28వ డివిజన్ లో నూతనంగా మంజూరైన 27 పింఛన్లను లక్ష్మీ నగర్లోని 203 వార్డు సచివాలయంలో APSFL ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తో కలిసి ఆయన పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. …

Read More »

పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికి గర్వకారణం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

–ఎమ్మెల్యే  చేతులమీదుగా దుర్గాపురం వాకర్స్ క్లబ్ లో పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతి సమైక్యత, సమగ్రతకు చిహ్నమైన త్రివర్ణ పతాక రూపకర్త తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. పింగళి వెంకయ్య  జయంతిని పురస్కరించుకుని దుర్గాపురం వాకర్స్ క్లబ్ నందు ఆయన విగ్రహావిష్కరణ, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ భిన్నత్వంలోని ఏకత్వం, సమతాస్ఫూర్తికి మన …

Read More »

జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శి గా ఎన్.వి.ఎస్ ప్రసాద్ నియామకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శి గా ఎన్.వి.ఎస్ ప్రసాద్ ని నియమించినట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్ ఆదివారం ఓ ప్రకటన లో తెలిపారు. విజయవాడ చెందిన ఎన్.విఎస్ ప్రసాద్ బీసీ సంఘం హక్కులకోసం సేవలందించి బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని, ఎల్లవేళలా బీసీలకు అందుబాటులో ఉండి బీసీల కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంఘం పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త కమిటీలు  …

Read More »

వ్యవసాయానికి పవర్ ఫుల్ పంపుసెట్లు…

-పీఎంబీఎల్డీసి మోటర్ల ఆవిష్కారం పై పరిశోధనకు ఏ పీ సీడ్కో శ్రీకారం -పంపుసెట్ల సామర్థ్యం పెంపు, వాటి జీవిత కాలాన్ని రెట్టింపు చేయటమే లక్ష్యం -ఆంధ్రా యూనివర్సిటీ తో ఎంఓయూ -పీఎంబీఎల్డీసి టెక్నాలజీ తో 90 శాతానికి పెరగనున్న వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యం -10 నుంచి 20 సంవత్సరకు పెరగనున్న పంపుసెట్ల జీవిత కాలం -పీ ఎం బీ ఎల్ డీ సి, ఇంధన సామర్ధ్య సాంకేతికలతో వ్యవసాయ రంగంలో 30 శాతం వరకు విద్యుత్ ఆదా చేసే అవకాశం -సాంప్రదాయ ఇండక్షన్ మోటర్లకు …

Read More »

పీవీ సింధుకు అభినందనలు తెలిపిన గవర్నర్ హరి చందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతోషం వ్యక్తం చేశారు. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబరిచి, వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించగా గవర్నర్ తన అభినందనలు …

Read More »

కనకదుర్గమ్మ సేవ కోసం జనసేన ధార్మిక సేవా మండలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి జనసేన ధార్మిక సేవా మండలి నియామకానికి ఆమోదం తెలిపిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధానానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవ చేయడంతోపాటు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా జరిగే నిత్య కైంకర్యాలు సక్రమ పద్ధతిలో జరుగుతున్నాయో లేదో అని పరిశీలించడం, ఆలయంలో భక్తిప్రవత్తులు వెల్లివిరిసే విధంగా పర్యవేక్షించడం ధార్మిక సేవా మండలి ప్రధాన లక్ష్యం. …

Read More »

2న నగర ప్రజల సమస్యల పరిష్కార వేదిక “స్పందన” : క‌మిష‌న‌ర్‌ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం మరియు సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ప్రకటన ద్వారా తెలియజేసారు. నగరపాలక సంస్థకు సంబంధించి ప్రజలకు మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌లో ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించుకొనుటకు ది.02.08.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మద్యాహ్నం 1.00 గంట వరకు న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయంలో మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్ మరియు మూడు సర్కిల్ …

Read More »

కలెక్టర్ జె. నివాస్ నేతృత్వంలో ముమ్మరంగా సాగుతున్న వరద ముంపు నివారణ చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం సాయంత్రానికి నాగార్జున సాగర్ డాం నుంచి మిగులు జలాలను విడుదల చేయనున్నారు. ఆదివారం అర్ధరాత్రి కి ఫుల్ రిజర్వాయర్ స్థాయికి చేరుకుంటుంది. ప్రారంభదశలో 2 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు విడుదల ఉండవచ్చు. సోమవారం ఉదయం నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నుంచి 5 లక్షల వరకు పెరగనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపద్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాలతో వరద ముంపు నివారణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. …

Read More »

వరద ఉధృతి దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి …

-సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి. ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం వరద ముంపు నివారణ చర్యల్లో భాగంగా నగరంలో ని భూపేష్ గుప్త నగర్, తారక రామనగర్, దోబీఘాట్, ఇంద్రకీలాద్రి రోడ్, పెనమలూరు , యన మలకుదురు ఇసుక …

Read More »

సోమవారం స్పందన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ లోని ప్రజల సమస్యల పరిష్కార సౌకర్యార్థం ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకూ స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వారిచే స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించ బడును. కృష్ణా జిల్లా కలెక్టర్ వారి సర్కులర్ ఆదేశాల మేరకు స్పందన కార్యక్రమం పునరుద్ధరణలో భాగంగా ప్రతి సోమవారం …

Read More »