Breaking News

Tag Archives: vijayawada

’ది గాడ్స్ వే’ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విపత్కర సమయంలో పేదలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. 59వ డివిజన్ సింగ్ నగర్ లోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో బుధవారం ’ది గాడ్స్ వే’ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న కొంతమంది పాస్టర్లకు నిత్యావసరాల సరుకుల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ  కరీమున్నీసా తో కలిసి  శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది …

Read More »

నగర పరిశుభ్రతకు సహకరించండి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిశుభ్రతకు గృహ యజమానులందరూ సహకరించాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 36 వ డివిజన్ సీతన్నపేటలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థ పదార్ధాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతపై గృహ యజమానులకు శాసనసభ్యులు వివరించారు. ఈ అవగాహనను శానిటేషన్ సిబ్బంది …

Read More »

దత్తత డివిజన్ పై గద్దె శీతకన్ను : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈ 15 వ డివిజన్ ని దత్తత తీసుకున్నాను అని ఆర్భాటంగా ప్రకటించిన అప్పటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డివిజన్ అభివృద్ధి కి చేసింది శున్యం అని, అందుకే ప్రజలు ఎక్కడ తిరగబడితారో అనే భయంతో మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. బుధవారం 15 వ డివిజన్ రామలింగేశ్వర నగర్ …

Read More »

మాస్క్ ధరించకుండా వాహనాలు నడపవద్దు : ఆర్టీఓ యం పద్మావతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోన కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, అది ప్రతిఒక్కరి బాధ్యతగా గుర్తించుకోవాలని ఆర్టీఓ యం పద్మావతి పేర్కొన్నారు. నందిగామలోని పాత బైపాస్ రోడ్డు దగ్గర మంగళవారం నాడు డిటీసీ యం పురేంద్ర ఆదేశాల మేరకు మాస్క్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న, ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కోవిడ్ పై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ యం పద్మావతి మాట్లాడుతూ కోవిడ్ ను నియంత్రించాలంటే మాస్కును ధరించడం భౌతిక దూరం పాటించడం వంటివి కీలక అంశాలని అన్నారు. …

Read More »

నో మాస్క్ నో రైడ్ సహకరించండి…

-మాస్క్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు కౌన్సిలింగ్ -ఆర్టీఓ కె రామ్ ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మన కొద్దిపాటి నిర్లక్ష్యం తిరిగి కరోన వ్యాప్తికి కారణం కాకూడదని ఆర్టీఓ కె రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాస్క్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా స్థానిక బందర్ రోడ్డు లోని ఆర్&బి కార్యాలయం ముందు ఆర్టీఏ …

Read More »

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమాచార శాఖ… : మంత్రి పేర్ని నాని

–నూతనంగా అసిస్టెంట్ డైరెక్టరుగా పదవి బాధ్యతలు చేపట్టిన యం. భాస్కరనారాయణ మంగళవారం జిల్లా కలెక్టరును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయుటలో ప్రధాన భూమిక సమాచార శాఖ పోషించాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కృష్ణాజిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై రాష్ట్ర సమాచార కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన యం. …

Read More »

ఇళ్ల నిర్మాణ లేఅవుట్ల అభివృద్ధి అప్రోచ్ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయండి…

-స్పందనలో అందిన విజ్ఞప్తులను గడువులోగా పరిష్కరించండి… -కోవిడ్ కట్టడికి నో మాస్క్ – నో ఎంట్రీ”, “నో మాస్క్ – నో రైడ్”, “నో మాస్క్ – నో సెల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు… -సబ్ కలెక్టర్ బి, సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ లో గృహనిర్మాణ శాఖచే ప్రతిపాదించిన ఇళ్ల నిర్మాణ అన్ని లేఅవుట్ల అభివృద్ది అప్రోచ్ రోడ్లతో సహా వారం రోజులోగా పూర్తి చేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. …

Read More »

నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నదే తన అభిలాష…

-శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహరావు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నందిగామలో కేంద్రీయ విద్యాలయం మంజూరుకు అవసరమైన స్థలం, ఇతర మౌలిక వసతుల విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహనరావు జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ డిఇఓ తహిరసుల్తాన తదితరులు పాల్గొన్నారు. నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నదే తన అభిలాష అని శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహరావు …

Read More »

గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల పునరావాస కార్యక్రమలపై సమీక్ష… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కరం కోసం మంగళవారం జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత, శాసనసభ్యులు వల్లభనేని వంశీ సంబంధిత నిర్వాసితులతో సమావేశం అయ్యారు. మంగళవారం స్థానిక జెసి క్యాంప్ కార్యాలయంలో గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల పునరావాస కార్యక్రమలపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా చినఆవుటపల్లిలో 423 కుటుంబాలకు సంబంధించి 49 ఎకరాల లేఅవుట్లో సంబంధించిన అంశాలను నిర్వాసితులతో సమీక్షించారు. లేఅవుల్లో ఎవిధమైన మౌలిక సదుపాయలు కల్పించాలనే అంశంపై చర్చించారు. ఎస్సీ, బిసి, …

Read More »

ఆర్టికె, సచివాలయాలు, బియంసియు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనా నిర్మాణ పనులను వేగవంతం చేయండి… : కలెక్టర్ జె.నివాస్

-ప్రతి మండలంలో వారానికి రెండు స్లాట్లు పడాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ భవన నిర్మాణాలు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. ఉపాధి హామీ కింద గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ భవన నిర్మాణాల ప్రగతి తీరుపై స్థానిక కలెక్టర్ …

Read More »