Breaking News

Tag Archives: vijayawada

ఘనంగా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పుట్టినరోజు వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశ నుంచే స్వర్గీయ దేవినేని నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వ్యక్తిగతంగా, రాజకీయంగా మా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, కుటుంబ సభ్యుల్లా ప్రతి సందర్భంలో అండగా నిలుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబుకి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల అంకితభావం, పార్టీ పట్ల మీ నిబద్ధత ఎల్లప్పుడూ అందరికీ ఆదర్శంగా …

Read More »

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తుల జనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి ఎండల్లోనూ కల్పించిన చల్లని సౌకర్యాలపై సర్వత్రా హర్షం విజయవాడ:ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.రద్దీ అత్యంత భారీగా పెరగడంతో, సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 …

Read More »

వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి PTLPWA సదస్సులో వక్తల డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (PTLPWA), ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపకుల సదస్సు స్థానిక యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. దీనికి ముఖ్య వక్తగా బొర్రా గొపిమూర్తి ఉమ్మడి గోదావరి జిల్లాల టీచర్స్ ఎంఏల్ సి పాల్గొని మాట్లాడారు. మీరు అడగకుండానే నేను మీ సమస్యలపై ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడాను. ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపకుల గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు ఇవ్వాలి. వెల్ఫేర్ బోర్డు, నిధిని ఏర్పాటు చేయాలి. ఉద్యోగ బద్రత …

Read More »

అగ్నికుల క్షత్రియులకు విద్యాపరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలి… : సైకం తిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నికుల క్షత్రియులకు విద్యాపరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలని సైకం తిరుమల రావు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాల అగ్నికుల క్షత్రియుల సామాజిక వర్గంలో అగ్నికుల, వన్నె కుల క్షత్రియ, వన్నె రెడ్డి, వన్నె కాపులకు ప్రభుత్వం నుంచి విద్యా పరమైన నిధులు అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. ఎడ్యుకేషన్ జీవోలో మిగతా కులాల నుంచి వేరు చేస్తూ అగ్నికుల క్షత్రియులకు ప్రత్యేక …

Read More »

ఈదురు గాలులు, వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా పనిచేసిన విజయవాడ నగరపాలక సంస్థ

-ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిషనర్ ధ్యానచంద్ర నిరంతర పర్యవేక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం సాయంత్రం నగరంలో కురిసిన వర్షాలు, ఈదురు గాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖాధిపతులతో వైర్లెస్ సెట్ ద్వారా నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లపై నీరు నిల్వ ఉండే పరిస్థితులు …

Read More »

సెన్సస్–2027లో 99% గృహ గణన పూర్తి

-త్వరలోనే జనగణనను కూడా 100% పూర్తి చేస్తాం : కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెన్సస్–2027 కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న గృహ గణన కార్యక్రమం 99 శాతం విజయవంతంగా పూర్తి చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం. తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి గృహాన్ని గుర్తించి వివరాలను నమోదు చేసే ప్రక్రియను అధికారులు, …

Read More »

ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మే 23, 2026 నుండి జూన్ 20, 2026 వరకు నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నారని, ప్రజల భాగస్వామ్యంతో నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం, పారిశుద్ధ్య కార్మికులపై భారం తగ్గించడం మరియు శుభ్రమైన నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించేలా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని …

Read More »

రాష్ట్ర ఎపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్ గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ఎన్టీఆర్ పరిపాలనా భవనంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్ గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్ గా సీహెచ్ మెహర్ రమేష్ లు ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పి. భరత్ భూషణ్ మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో సినిమా, కళలు, నాటకరంగ అభివృద్దికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక …

Read More »

ఈ నెల 25న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, …

Read More »