Breaking News

ఎన్.టి.టి.పి.ఎస్ డ‌స్ట్ స‌మ‌స్య‌పై ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన రైల్వే ఉద్యోగులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండ‌ప‌ల్లి లోని ఎన్.టి.టి.పి.ఎస్ నుంచి విడుద‌లయ్యే డ‌స్ట్ కార‌ణం త్రాగునీరు, గాలి తీవ్రంగా కాలుష్యమై ఆ ప్రాంత వాసులు అనారోగ్యానికి గురి అవుతున్నార‌ని…ఆ స‌మ‌స్యను ష‌రిష్క‌రించాల‌ని కోరుతూ గుంటుప‌ల్లిలోని రైల్వే వ్యాగ‌న్ వ‌ర్క్ షాప్ ఉద్యోగులు, కాల‌నీ వాసులు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)కి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. వ‌ర్క్ షాప్ కాలనీలో నివాసం వుంటున్న‌500 కుటుంబాల‌తో పాటు చుట్టు ప్ర‌క్క‌ల గ్రామ ప్ర‌జ‌లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు చెప్పారు.

గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లోని శుక్ర‌వారం సౌత్ సెంట్రల్ రైల్వే ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ , ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్ర‌తినిధి బృందం ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిశారు. ఎన్.టి.టి.పి.ఎస్ నుంచి డ‌స్ట్ పైకి విర‌జిమ్ముకుండా ఏర్పాటు చేసిన ఫిల్ట‌ర్లు ప‌నిచేయ‌టం లేద‌ని, అందువ‌ల్లే ఈ ప‌రిస్థితులు ఏర్పాడ్డాయ‌ని వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఎంపి దృష్టికి తీసుకువెళ్లారు.

ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఈ అంశం త‌న దృష్టిలో వుందని, ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం నుంచి నిధులు విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం ఎన్.టి.టి.పి.ఎస్. నిర్వ‌హ‌ణ‌ కి ఒక రూపాయి కూడా విడుద‌ల చేయ‌క‌పోవ‌టం వ‌ల్లే ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌న్నారు. రెండు నెల‌ల్లోపు ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్కారం అవుతుంద‌ని హామీ ఇచ్చారు. అలాగే ఎంపి కేశినేని శివ‌నాథ్ దృష్టికి నల్లకుంట నుండి వ్యాగన్ వర్క్ షాప్ వరకు రోడ్డు పాడైపోయింద‌నే విష‌యం తీసుకురాగా సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని మాటిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఓబిసి ఎంప్లాయిస్ అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ ఎల్ ఎస్ ఆర్ కే ప్రసాద్ బ్రాంచ్ చైర్మన్ బిఎల్వి ప్రసాద్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ , సెక్రెటరీ కె రాజ్ కుమార్ ల‌తో పాటు కార్య‌వ‌ర్గ స‌భ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *