తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యాన శాఖ ఆద్వర్యం లో శ్రీకాళహస్తి మండలం లో నడుప బడుతున్న ఉద్యాన నర్సరీ నందు కల మామిడి మరియు కొబ్బరి మొక్కలలో నాణ్యత పరిమాణాల పై జిల్లా ఉద్యాన అధికారి, తిరుపతి క్షేత్ర స్థాయి పరిశిలన చేసినారు. నాణ్యమైన మామిడి మరియు కొబ్బరి మొక్కలు పంపినికి అందుబాటులో వున్నాయి అని మరియు ఉద్యన శాఖ పథకాలు అమలులో నర్సేరి ద్వార తక్కువ కర్చులో మొక్కలు కొనుగోలు చేసుకొని తగు రాయితీ కొరకు దరకాస్తు చేసుకోమని తెలిపినారు.మామిడి మొక్కలు 45 రూపాయలు మరియు కొబ్బరి మొక్కలు 60 రూపాయలు కి అందుబాటులో వున్నాయి .మామిడిలో బెనేశ(బంగినపల్లి), బెంగ్లోర, మల్లిక , నీలమ్ , చందుర రకాలు ఉన్నాయి. బెనిష, 4 అడుగుల మొక్కలు, మల్లిక, బెంగ్లోర ౩ అడుగుల మొక్కలు , వున్నాయి. నీలుం, చందుర మొక్కలు జనవరి 15 కి అందుబాటులోకి వస్తాయి అన్ని గ్రామాలలో రైతులుఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనికోరుతున్నాము. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ లు 7995086968, యం పిఇవో 9100411321.ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో వుంటారు.
Prajavartha Online Telugu News