Breaking News

కొనకళ్ళ నారాయణ రావు, వీరంకి వెంకట గురుమూర్తి లను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన కొనకళ్ళ నారాయణ రావు ని మరియు ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నియమితులైన వీరంకి వెంకట గురుమూర్తి లను ఆంధ్రప్రదేశ్ విప్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం విజయవాడ కార్యాలయంలో కొనకళ్ళ నారాయణరావు, గురుమూర్తిలను కలసి దుశ్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కష్టపడేవారికి సముచిత స్థానం కల్పించారని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్త స్థాయి నుంచి పార్టీ ఆదేశానుసారం నిబద్దతతో పనిచేసిన వ్యక్తి గురుమూర్తి అని కొనియాడారు. పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని వారికి మంచి పదవి ఇచ్చారన్నారు. ఆర్టీసీ చైర్మన్‌, ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు వారికి కేటాయించడం ద్వారా సీఎం చంద్రబాబు, పార్టీలోని నేతలు, కార్యకర్తలకు ఎంత పెద్ద పీట వేస్తారో అర్థమవుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *