డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-నేడు డిసెంబర్ 15 ఆదివారం కలక్టరేట్ లో పొట్టి శ్రీరాములు వర్ధంతి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు సోమవారం  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. భూ సంబంధ సమస్యలు పరిష్కారం కోసం గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో అర్జీలను స్వీకరించడం, అర్హత కలిగిన వాటినీ 33 రోజుల్లో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవిన్యూ సదస్సు నిర్వహించిన అర్జీలను పి జి ఆర్ ఎస్ పోర్టల్ లో అప్లోడ్ చెయ్యాలని అధికారులను ఆదేశించి నట్లు తెలిపారు.

నేడు కలక్టరేట్ లో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం:
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని డిసెంబర్ 15 ఆదివారం నివాళులు అర్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు మేరకు కలక్టరేట్ లో జిల్లా యంత్రాంగం తరపున ఉదయం 10 గంటలకి నివాళులు అర్పించనున్నట్లు కలక్టర్ తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *