Breaking News

నాలుగు వేలకుపైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూ కే చారిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నాలుగు వేలకుపైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు ఆంధ్ర హాస్పిటల్ చిల్డ్రన్స్ సర్వీసెస్ & డైరెక్టర్ ప్రముఖ వైద్యుల డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు. శనివారం సూర్యరావుపేటలోని ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హర్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో 33వ ఉచిత పిల్లల గుండె ఆపరేషన్ల క్యాంపు ఈనెల డిసెంబర్ 9 నుండి 14 వరకు నిర్వహించామని డా: నెల్సన్ ఒలివర్ డేవిడ్, పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ క్విన్స్ ల్యాండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆస్ట్రేలియా డా. క్రిస్టియన్ అలెగ్జాండర్, పిడియాట్రిక్ కార్డియాక్ ఇంటెన్స్ విస్ట్, స్టువర్ట్ హ్యారీ, హన్న ఎలిజిబెత్, మోర్టన్, తదితరులు క్విన్స్ ల్యాండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వరరావు, కార్డియాక్ సర్జన్, డాక్టర్ సాయిరాం, పిల్లల కార్డియాక్ సర్జన్ తో కలిసి ఆంధ్ర హాస్పిటల్స్ లో 16 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించారని, అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు టెట్రాలజీ ఆఫ్ ఫాలో, డి ఓ ఆర్ వి, పల్మనరి ఎట్రాసియా, పి ఏ పి వి డి,పి ఏ బాండింగ్ క్లిష్టమైన గుండె ఆపరేషన్లు ఈ క్యాంపులో విజయవంతంగా నిర్వహించామన్నారు, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి60 ఆపరేషన్స్ చొప్పున సంవత్సరానికి 600 చిన్నారులకు గుండె ఆపరేషన్లు, ఇంటర్వెన్షన్స్ చేస్తున్నామని అన్నారు పిల్లల గుండె జబ్బులు ఉన్నవారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి మన వస్తున్నారని, ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ల బృందానికి ,నర్సులు బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ క్యాంపు ఆంధ్ర మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్, వసుధ ఫౌండేషన్, మహేష్ బాబు ఫౌండేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ సహకారంతో నిర్వహించామన్నారు ఈ విలేకరుల సమావేశ కార్యక్రమంలో డాక్టర్ విక్రమ్ ప్రియాట్రిక్ సర్జన్, డాక్టర్ సాయిరాం, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ శ్రీమన్నారాయణ, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ ఎనస్తీసియన్ డాక్టర్ ఉమా శంకర్ పిల్లల కార్డియాక్ ఇంటెన్స్ వెస్ట్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *