Breaking News

బాల్య వివాహల నిర్మూలన గోడ పత్రిక ఆవిష్కరన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి 16.12.2024 సోమవారం నాడు తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో ఆదివాసి అభివృద్ధి సంస్థ మరియు స్వచ్ఛంద సంస్థల ద్వారా ముద్రించిన బాల్య వివాహల నిర్మూలన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులు, ఎన్ జి ఓ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెసి శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్య నారాయణ, ఆదివాసి అభివృద్ధి సంస్థ అధ్యక్షులు చందమామ కోటయ్య, పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పి అమర్నాథ్, హెల్పింగ్ హాండ్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎం దొరస్వామి, మనసంస్కృషి కళా సంస్థ కార్యదర్శి K. రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *