Breaking News

ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ కార్యాలయం ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు

-వైసీపీ శ్రేణులతో కోలాహలంగా మారీన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మరియు విజవాడ నగరం నుండి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అభిమానులు,శ్రేయోభిలాషులు దేవినేని అవినాష్  కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్శకులతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అభిమానంతో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు. మీ ప్రేమాభిమానాలు మా పై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు మనందరికీ మంచి చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి మరలా జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి కావడానికి అండగా నిలవాలని అవినాష్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *