Breaking News

కేంద్ర మంత్రి హెచ్‌.డీ కుమార స్వామితో మంత్రి టీజీ భరత్ భేటీ

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డీ కుమార స్వామి, ఉక్కు శాఖ కార్యదర్శితో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమావేశం అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఆర్సెలార్ మిట్టల్‌కు ఐరన్ ఖనిజం సరఫరాపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎంతో సానుకూలంగా స్పందించినట్టు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ ఒప్పందం సులభతరం చేయడంలో సహకరించినందుకు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమార్ స్వామికి.. భరత్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి డైనమిక్ నాయకత్వానికి, దార్శనికతకు ఈ ప్రగతి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరిగేలా కృషి చేస్తామని టీజీ భరత్ చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *