Breaking News

దాతృత్వాన్ని చాటుకున్న వరుణ్‌ గ్రూప్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటే వరుణ్‌ గ్రూప్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. శనివారం సిటీ ఆర్మడ్‌ రిజర్వు పోలీస్‌ గ్రౌండ్‌ నందు పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు నేతృత్వంలో జరిగిన సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమంలో వరుణ్‌ గ్రూప్‌ పాల్గొని ట్రాఫిక్‌లో హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పించే దిశగా ఉచితంగా 100 హెల్మెట్‌లను పంపిణీ చేశారు. పాత్రికేయులకు, తదితరులకు వరుణ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ పి.వి.సత్యనారాయణ చేతుల మీదుగా పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు పంపిణీ చేశారు. అనంతరం వరుణ్‌ గ్రూప్‌ తరఫున ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన పి.వి.సత్యనారాయణను పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు అభినందించారు. ఈ సందర్భంగా వరుణ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో తనను తాను రక్షించుకునే నేపథ్యంలో ప్రతివారు హెల్మెట్‌ ధరించాలని కోరారు. ప్రజల్లో హెల్మెట్‌ పై అవగాహన బాగా పెరిగిందని, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా హెల్మెట్‌ వాడకంపై నగరంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసు శాఖ వారికి బాధ్యతగా హెల్మెట్లు వాడి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరుణ్‌ గ్రూప్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *