Breaking News

ఫిబ్రవరి 3న గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3, 2025 న ఉదయం 10.30 నుండి మధ్యాన్నం 3 గంటల వరకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతాయని, 16 జనవరి న నోటిఫికేషన్ ప్రకటిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశమందిరం నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఓటర్ల లిస్టు 16 వ తేదీ (గురువారం) ప్రకటించామని, వోటర్ల లిస్టు, నోటిఫికేషన్ ను నగర పాలక సంస్థ నోటీసు బోర్డు లో ఏర్పాటు చేయటమైనదన్నారు. ఈ నెల 22 నుండి 24 వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు జియంసి అదనపు కమీషనర్ ఛాంబర్ లో నామినేషన్ లు దాఖలు చేయవచ్చునన్నారు. 24 వ తేదీ అందిన నామినేషన్ల ప్రకటన జరుగుతుందని, 27 వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని, అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన చేయబడుతున్దన్నారు. ఈ నెల 30వ తేదీ మధ్యాన్నం 12 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అనంతరం తుది పోటీలోని అభ్యర్ధుల ప్రకటన చేయబడుతున్దన్నారు. ఫిబ్రవరి 3 వ తేదీ న ఉదయం 10.30 నుండి 3 గంటల వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నిక జరుగుతుందని, అదే రోజు 3 గంటల నుండి వోట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందని తెలిపారు. సదరు సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యుటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాసరావు, కౌన్సిల్ సెక్రటరీ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *