గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పశుసంవర్థకశాఖ, గుంటూరు జిల్లాలో వున్న 18 మండలాల్లోని అన్నీ గ్రామాల్లో పశుఆరోగ్య శిబిరాలు ఈ నెల 20-01-2025 నుండి 31-01-2025 వరకు జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకము సౌజన్యంతో నిర్వహిస్తున్నారు, ఈ శిబిరాలల్లో ఉచిత పశు ఆరోగ్య పరీక్షలు, తేలికపాటి శస్త్రచికిత్సలు, ఎదకు రాని, చూలు కట్టని మరియు ఇతర కర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, తగు వైద్యం అందించడం, పశువులకు, దూడలకు మరియు సన్నజీవాలకు నట్టల నివారణ మందు, పశువులకు మరియు కోళ్లకు వ్యాధినిరోధక టీకాలు మరియు అవగాహన శిబిరాలలో పశుపోషకులకు శాస్త్రీయ పశుయాజమాన్య పద్దతులపై నిష్ణాతులైన పశువైద్యులచే నిర్వహించబడును. ఈ శిబిరం కొరకు ప్రతి మండలంలో 2 టీమ్లను ఏర్పాటు చేసి ప్రతి టీమ్కు ఒక పశువైద్యుదుని, పశువైద్యసహాయకుడును, గోపాలమిత్ర మరియు సహాయసిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగినది. ఈఅవకాశాన్ని పశుయజమానులు అందరూ వినియోగించుకోవాలని డా॥ ఓ.నరసింహారావు గారు, సంయక్త సంచాలకులు జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి తెలియజేశారు.
Prajavartha Online Telugu News