గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహించే గ్రీవెన్స్ కు అందే ఫిర్యాదులు, ఆర్జీలను అధిక ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ విభాగాదిపతులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కార్మికుల ప్రత్యేక గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గ్రీవెన్స్ లో అందే ఆర్జీలను, ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విభాగాదిపతులను ఆదేశించామని తెలిపారు. కార్మికులు కూడా కేటాయించిన విధులను అంకిత భావంతో నిర్వహించాలని, జీతాలు, ఇతర అలవెన్స్ లు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలపై గ్రీవెన్స్ లో నేరుగా తమ దృష్టికి తేవాలన్నారు.
అనంతరం గాంధీ పార్క్ లో వర్క్ ఔట్ సోర్సింగ్ పద్దతి పై విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ని వర్క్ ఔట్ సోర్సింగ్ కాకుండా ఔట్ సోర్సింగ్ లో టెండర్ పిలిచి, కనీస వేతనాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, అర్బన్ హెల్త్ సెంటర్ లలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ మహిళా మల్టి పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు నగరపాలక సంస్థ డిస్పెన్సరిలో విధులు కేటాయించాలని, పారిశుధ్య విభాగములో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు ఇంచార్జి ఇన్స్పెక్టర్లుగా విధులు కేటాయించాలని ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు, యుజిడి కార్మికుల పెండింగ్ అలవెన్స్ లను మంజూరు చేయాలని యాకోబు కోరారు.
కార్యక్రమంలో ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, విభాగ సూపరిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News