Breaking News

త్రాగునీటి పైప్ లైన్ మరమత్తు పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని 3 వంతెనల వద్ద 700ఎంఎం డయా సిఐ పైప్ లైన్ మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే పూర్తి చేయాడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. గురువారం కమిషనర్  3 వంతెనల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, పనుల వేగవంతంపై ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పైప్ లైన్ మరమత్తు పనుల వలన నాజ్ సెంటర్ (ఎల్ఎల్ఆర్) రిజర్వాయర్ పరిధిలో పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని, పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల వేగవంతంకు రాత్రి సమయంలో చేయడానికి తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పనులకు రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ కళ్యాణరావు, ఏఈ మధు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *