-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ శుక్రవారం జనవరి 25 2024న తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం లో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల ఏర్పాట్లను, జనవరి 26, 2024న ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కమిషనర్ అన్నారు.
వేడుకలకు వచ్చే ప్రజలకు త్రాగునీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించే వేడుకల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని ఇంచార్జ్ కమిషనర్ అన్నారు.