గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయవాదులు మధ్యవర్తిత్వ పద్ధతులపై మెలకువలు పెంపొందించుకోవడం ద్వారా కక్షిదారులకు తక్కువ ఖర్చుతో సత్వర న్యాయాన్ని అందించవచ్చని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ జస్టీస్ రవినాధ్ తిల్హరి గారు తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్వాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై అవగాహాన కోసం న్యాయవాదులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ జస్టీస్ రవినాధ్ తిల్హరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ జస్టీస్ రవినాధ్ తిల్హరి మాట్లాడుతూ పెరిగిపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి అవకాశం అని తెలిపారు. మధ్యవర్తిత్వంలో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని ఆయిన వివరించారు. అంతే కాకుండా వ్యాపార సంబంధమైన మరియు కుటుంబ తగాదాలకు సంబంధించిన వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించు కుంటే ఇరుపక్షాలకు ఉపయోగకరంగా వుంటుందని సూచించారు.మధ్యవర్తిత్వం మరింతగా అందుబాటులోకి తేవడానికి న్యాయవాదులు ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో వారిది ముఖ్య భూమిక అన్నారు. మధ్యవర్తిత్వం ప్రజల ముంగిటకు తీసుకు వెళితే న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు వస్తాయని, కావున మధ్యవర్తిత్వంపై ఉన్న అపోహలు విడనాడాలని సూచించారు.
తదనంతరం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్మన్ శ్రీ జస్టిస్ రావు రఘునందన్ రావు గారు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం కోసం ఇటీవల చట్టాలలో అనేక సవరణలు చేశారని, మధ్యవర్తిత్వం చట్టాన్ని తీసుకు వచ్చారవి తెలిపారు. అంతే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం ఆన్లైన్ ద్వారా కూడా మధ్యవర్తిత్వం నిర్వహించే వెసులుబాటు వుందని, దీనిద్వారా సత్వర న్యాయం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, జిల్లా కోర్టులలో పెండింగ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టాలంటే న్యాయవాదులు మధ్యవర్తులుగా ఉంటూ కేసులను పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యిమంది న్యాయవాదులు మాత్రమే మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారనికి శిక్షణ పోందారని, ఈ సంఖ్య కనీసం 40 వేలకు చేరితేనే పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నలుగురు న్యాయవాదులలో ఓకరు మధ్యవర్తులుగా శిక్షణ పోందాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్వాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి శ్రీమతి యం బబితా మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ఇటీవల వస్తున్న మార్పులపైన మరియు కొత్తగా చేసిన చట్టాలపైన అవగాహన కలిగించడం కోసం ఈ రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. ఇప్పటివరకు అన్ని బార్ అసోసియేషన్లలోను, మండలస్థాయి, జిల్లా స్థాయి, హైకోర్టు స్థాయిలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ మరియు ఆత్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ – ఇన్-చీఫ్ గారైన శ్రీ జస్టిస్ థీరజ్ సింగ్ ఠాకూర్ గారి సూచనల మేరకు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ వై వీ ఎస్ బీ జీ. పార్థ సారధి గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ సేవల కమిటి కార్యదర్శి శ్రీమతి జి. మాలతిగారు, ఆధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్వాయసేవాధికార సంస్థ ఉపకార్యదర్శి డాక్టర్ హెచ్ అమరరంగేశ్వర రావు గారు, గుంటూరు జిల్లా న్వాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి టీ లీలావతిగారు, సీనియర్ ట్రైనర్స్ రత్నతార, శ్రీ అరుణాచలంగారు , ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిదంబరం, రాష్ట్రంలోని అన్నిన్యాయ స్థానాల నుండి వచ్చిన న్యాయివాదులు, గుంటూరు నుండి న్యాయ కళాశాల విద్యార్ధులు మరియు తదితరులు పాల్గొన్నారు.