Breaking News

డ్రైవర్లు ప్రతినిమిషం అప్రమిత్తంగా ఉండాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వాహనాలు నడుపే సమయంలో డ్రైవర్లు ప్రతినిమిషం అప్రమత్తంగా ఉండాలని మోటర్ వెహికల్ ఇన్సెపెక్టర్ టి.రాఘవరావు అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కళాశాల నందు గుంటూరు జిల్లా రవాణా శాఖ అధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాలు 2025 భాగంగా జిల్లాలోని పలు కళాశాలల బస్సు డ్రైవర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మోటర్ వెహికల్ ఇన్సిపెక్టర్స్ కె.మల్లీశ్వరి, ఏ.సంధ్య, జి. సౌజన్య, టి.రాఘవరావు హాజరయ్యారు. ఈ సంధర్బంగా రాఘవరావు మాట్లడుతూ రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు. రోడ్లకు ఎడమ వైపు మాత్రమే వాహనాలు నిలపాలని తెలిపారు. యాజమాన్యలు డ్రైవర్లకు ప్రతి మూడునెలలకు ఒకసారి వైద్యపరిక్షలు నిర్వహించాలని తెలిపారు. రోడ్డుపైకి వచ్చే వాహనాలకు తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు కలిగిఉండాలని అన్నారు. రోడ్డు భద్రత మనందరి భాద్యత అని రోడ్డు భద్రత వారోత్సవాలు మనందరి మంచికోరి రవాణా శాఖ నిర్వహిస్తుందని అన్నారు. రవాణా శాఖ అందించే సూచనలు డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అనంతరం డ్రైవర్లచే రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో వివిఐటి ట్రాన్స్పోర్ట్ కన్వీనర్ పి.వి. సురేంద్ర మోహన్ కుమార్, ఎల్.విజయ్ కుమార్, విద్యార్ధులు, వివిఐటి రవాణా సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *