Breaking News

76 వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరిగే 76 వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి పరిశీలించారు. పెరేడ్ గ్రౌండ్ లోని డయాస్ , వివిధ శాఖలు ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ , విఐపి గ్యాలరీ , స్టూడెంట్స్ గ్యాలరీ , పబ్లిక్ గ్యాలరీ , మీడియా గ్యాలరీ లను పరిశీలించి సూచనలు అందించారు. . ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ జరుగుతున్న నేపద్యంలో గ్రౌండ్ లో మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ ఆదివారం ఉదయం 8.00 గంటల లోపు పెరేడ్ గ్రౌండ్ కు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ షేక్ . ఖజావలి , ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , జెడ్పి సిఇఓ జ్యోతిబసు , పీడీ డ్వామా శంకర్ , డిటీసీ కె. సీతారామి రెడ్డి , పీడీ డీఆర్డీఏ ఉమాదేవి , జిల్లా ఉపాధి అధికారిణి దుర్గాబాయి , డియం అండ్ హెచ్ఓ డా. విజయలక్ష్మీ, జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మీ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిణి కోమలి పద్మ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *