-ఓటు హక్కు పొందిన వారు వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలి : జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్
-గ్రామీణ ప్రాంత ఓటర్ల వలె పట్టణ ప్రాంత ఓటర్లు కూడా తమ ఓటు హక్కును తప్పక వినియోగించు కోవాలి: విసి ఎస్పీఎంవివి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదు కావాలని, 17 సం.లు నిండిన ప్రాస్పెక్టివ్ వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, తమ ఓటు హక్కును ఎన్నికలలో ప్రతి ఓటర్ తప్పక వినియోగించుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి మౌర్య , జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, విసి సంయుక్తంగా పేర్కొన్నారు.
శనివారం ఉదయం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 పురష్కరించుకుని స్థానిక తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున విద్యార్థినీ విద్యార్థులు, ఉపాద్యాయులు, యువత, సీనియర్ సిటిజన్స్, ప్రజలు తదితరులతో కలిసి ర్యాలీని జెండా ఊపి నగర పాలక సంస్థ కమిషనర్ మరియు జెసి ప్రారంభించగా, ర్యాలీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం వరకు కొనసాగింది.
అనంతరం ఆడిటోరియం నందు జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 కార్యక్రమాన్ని ఆహుతులు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఉమా గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఓటర్ల ప్రతిజ్ఞ తో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతూ 145 కోట్లు మంది జనాభా 2024 నాటికి ఉన్నారని, 99.1 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారనీ, ఇంకనూ చాలా మంది ఓటరుగా నమోదు కావాల్సి ఉందని, ఓటర్లు తమ హక్కును చాలా మంది వియోగించుకోవడం లేదని, తప్పక వినియోగించుకోవాలని అన్నారు. గత సంవత్సరం థీమ్ కొనసాగింపుగా “నథింగ్ లైక్ ఓటింగ్… ఐ ఓటు ఫర్ ష్యూర్” (Nothing like voting… I vote for sure) అనే నినాదం ఈ సంవత్సరం కొనసాగుతుందని అన్నారు. ఓటు వేయడం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకొని మన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని అన్నారు. 17 సంవత్సరాలు నిండిన వారు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నందు మీరు ఆన్లైన్ నందు కానీ, బి ఎల్వో ద్వారా గానీ అప్లై చేసుకొని ఓటరుగా నమోదు కావాలని ప్రాస్పెక్టివ్ ఓటర్లను కోరారు. ఓటు వేయకుండా మిగిలి ఉన్న వారిని, ప్రాస్పెక్టీవ్ ఓటర్లను చైతన్య పరచడానికి, అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా 18, 19 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కొరకు ప్రోత్సహిస్తుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఫారం 6 ద్వారా ఓటర్ గా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈవియం లు ట్యాంపరింగ్ కు అవకాశం లేదని, ఇది ఎంతో భద్రమైన, నమ్మకమైన వ్యవస్థ అని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరణకు వచ్చే సిబ్బందికి అందించడం ద్వారా పరిసరాల పరిశుభ్రత మెరుగవడమే కాకుండా చెత్త నుండి ఆదాయం కూడా వస్తుందని, ప్రతి విద్యార్థినీ, విద్యార్థులు తమ తల్లి దండ్రులకు తెలిపి అందరూ స్వచ్ఛ తిరుపతికి సహకరించాలని వారు కోరారు.
జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యానికి ముందు 10 శాతం మందికి మాత్రమే తమ నాయకులను ఎన్నిక చేసుకునే అవకాశం ఉండేదని, స్వాతంత్ర్య అనంతరం 1950 లో భారత ఎన్నికల సంఘం ఏర్పాటు అయిందని, 2011 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25 న జాతీయ ఓటర్ దినోత్సవం క్రమం తప్పకుండా జరువుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు పై బడిన అందరూ ఓటు హక్కు పొంది వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల అన్నింటి కంటే ముఖ్యమైనది ఓటు హక్కుని, కులం మతం, వర్గం, ధనిక పేద వర్గాల తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ 18 సం. నిండిన వారికి ఓటు హక్కు కల్పించి తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించడం జరిగిందనీ తెలిపారు. ఓటరుగా నమోదు అయిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు.
విసి మాట్లాడుతూ యువ ఓటర్లను, 17, 18,19 సం.ల యువతీ యువకులకు ఓటరు గా నమోదు అయ్యేందుకు వారికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటరుగా వారు నమోదు, ఓటు హక్కు వినియోగం ఎక్కువగా ఉంటుందని, పట్టణ యువత, ఓటర్ల ఓటింగ్ శాతం తక్కువ ఉందని, పట్టణ ప్రాంతాల వారు కూడా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
డిఆర్ఓ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం భారత ఎన్నికల సంఘం ఏర్పడిన తర్వాత 2011 నుండి జాతీయ ఓటర్ దినం జరుపుకుంటున్నామని తెలిపారు.18 సం. నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదు అయ్యేల, ఓటరుగా నమోదు అయిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్య పరచడం ఈ కార్యక్రమ నిర్వహణ ఉద్దేశ్యం అని తెలిపారు. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషన్, న్యూ ఢిల్లీ వారి డాక్యుమెంటరీ వీడియో ను అందరూ తిలకించారు.
సీనియర్ సిటిజన్స్ ను శాలువా, పూల మాలలతో సముచితంగా ప్రముఖులు సత్కరించారు. అలాగే ఈఆర్ఓ లకు ,ఏఈర్ ఓ లకు మరియు బి యల్ ఓ లకు ప్రశంసా పత్రాలను, 18 సంవత్సరాలు నిండి ఓటర్ గా నమోదైన యువతకు కొందరికి ఓటర్ గుర్తింపు పత్రాలను పంపిణీ చేశారు. అలాగే పాఠశాల, కళాశాలల నుండి వక్తృత్వ, క్విజ్, వ్యాస రచన, డిబేట్ లలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రం, మోమెంటోలను అందచేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ నందు ఉద్యోగి సురేష్ ఓటు హక్కు వినియోగంపై ప్రదర్శించిన వందేమాతరం పాటకు చేసిన డ్యాన్స్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. డాక్టర్ విజయ్ కుమార్ ఎస్వీ యూనివర్సిటీ విశ్రాంత ఉద్యోగి మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో పలువురు ఎ ఈ ఆర్ ఓ లు, బియల్ ఓ లు,సూపర్వైజర్లు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News