-ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలోనే ప్రజాస్వామ్యా నికి ఉత్తమ ఉదాహరణగా నిలిచే ఆదర్శ రాజ్యాంగం మన దేశ రాజ్యాంగమంటూ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయవాడ ఎంపీ కేశనేని శివనాధ్ గణ తంత్ర దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపి కేశినేని శివనాథ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత ప్రజలకు సమాన త్వాన్ని, వాక్, సభా స్వాతంత్య్రలను ఇచ్చే ప్రాథమిక హక్కులు, సమిష్టి ఆదేశక సూత్రాలను కల్పించిన ఉదాత్తమైనది. దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించేందుకు అవసరమైన న్యాయ, చట్ట, పాలనా సూత్రాలను అందిస్తూ ముందుకు సాగుతోంది. ఎన్నో ప్రాంతాలు, మరెన్నో భాషలను తనలో ఇముడ్చుకున్న పార్లమెంట్ ను , రాష్ట్ర అసెంబ్లీలను ప్రగతి బాటలో నడిపిస్తున్న భారతదేశ మార్గదర్శి మన రాజ్యాంగం.
గత ఐదేళ్ల జగన్ పాలనలో పాలకులు రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కులు కాలరాశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా, దాని విలువల్ని దిగజార్చే విధంగా ప్రవరిస్తే ఏ నాయకుడు ఎక్కువ కాలం మనగడ సాధించలేడు. అందుకే ప్రజలు తమ ఓటుతో గత ప్రభుత్వాన్ని పీఠం దించి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న డబుల్ ఇంజన్ సర్కార్ దేశ,రాష్ట్ర ప్రజల కలలను నేరవేరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది పథంలో నడిపిస్తానని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
Prajavartha Online Telugu News