విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం ఎంపి అంబికా జి. లక్ష్మీనారాయణగురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపి కేశినేని శివనాథ్ కు ఎంపి లక్ష్మీనారాయణ పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం పార్లమెంట్ లో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు గుర్రం కొండయ్య, విజయవాడ వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు వరిగే నరసింహారావులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
