Breaking News

తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ .ఎస్ 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త
స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ .ఎస్ పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని మిని సమావేశ మందిరం నందు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, స్మార్ట్ సిటీ పై ఎన్ ఇ సి కంపెనీ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుతున్న అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలోపు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. పూర్తి అయిన పనులకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. పెండింగ్ లో వివిధ దశలలో ఉన్న ప్రాజక్టుల పనులలో పురోగతి ఉండాలని తెలిపారు. నగరంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం నిర్మాణ పనుల కూడా నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జి. ఎం. చంద్రమౌళి,ఎన్ ఇ సి ప్రతినిధులు ప్రదీప్, జమాల్, అంబర్, ఫణి కుమార్, కెల్ట్రాన్ సతీష్, ఏఇకామ్ ప్రతినిధిలు బాలాజీ, చంద్రా రెడ్డి, హేమ, ఎస్ ఈ శ్యాంసుందర్, ఈ ఈ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *