Breaking News

తిరుపతి జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జరుగు విక్రమ్ కుమార్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా పని చేస్తున్న యు.చెన్నయ్య ను చిత్తూరు జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా డిప్యుటేషన్ పై నియమిస్తూ అలాగే వారికి ఎస్సీ కార్పొరేషన్ కార్య నిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జి.ఓ మేరకు వారు తిరుపతి జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారి బాధ్యతల నుండి రిలీవ్ అవగా తిరుపతి జిల్లాకు నూతన జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికార అధికారిగా డైరెక్టరేట్ నుండి వచ్చిన జరుగు విక్రమ్ కుమార్ రెడ్డి నేటి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారిని కలెక్టరేట్ నందు కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పించి మర్యాద పూర్వకంగా కలిశారు.

అన్నమయ్య జిల్లా వాస్తువ్యులైన విక్రమ్ కుమార్ రెడ్డి 2022 గ్రూప్ – 1 అధికారిగా సెలెక్ట్ కావడం జరిగింది. వీరు జెఎన్టీయు అనంతపురం నందు బి. టెక్ ఈఈఈ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీల సంక్షేమం మరియు అభ్యున్నతి కొరకు తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *