Breaking News

“మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం…అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు…..

-శాసనమండలి ( ఎంఎల్ సి) పట్టబద్రుల నియోజవర్గానికి ఎన్నిక నేపథ్యంలో “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం…..
-అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు…..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ద్వై వార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కృష్ణా జిల్లాలో కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం శాసనమండలి పట్టబద్రుల నియోజకవర్గానికి ఎన్నికకు జనవరి 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేసి తక్షణమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ( ఎంసిసి) అమలులో ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల మూడవ తేదీ సోమవారం కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలో నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సెల్ సిస్టం (పిజిఆర్ఎస్) తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని, అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లోను తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలాజీ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *