Breaking News

వ్యవసాయ రంగానికి మరింత ఉత్తేజం ఇచ్చిన బడ్జెట్

-కింజరాపు అచ్చెంనాయుడు, వ్యవసాయ మంత్రి 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఋజువయ్యిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు  బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ కేవలం ఒక తరగతికో వర్గమునకో పరిమితం కాకుండా అభివృద్ది మరియు సంక్షేమ ములలో అన్ని వర్గాలను ముఖ్యముగా రైతులు ,మహిళలు ,యువత మరియు మద్యతరగతి తదితర అన్ని వర్గాల అభివృద్ది కేంద్రీకృత బడ్జెట్ గా నిలిచిందని తెలియచేసారు .
ఈ రోజు ప్రతిపాదించిన ₹ 50,65,345/- కోట్ల రూపాయల బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ₹1,71,437 /- కోట్ల రూపాయలను కేటాయించి వ్యవసాయ రంగ కేంద్రీకృత బడ్జెట్ గా నిలిచి రైతుల మన్నలను పొందిందని తెలిపారు .ముఖ్యముగా
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఋణ పరిమితి ని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచడం
పత్తి పంటలో నాణ్యమైన ఉత్పత్తి పెంచే దిశగా ,మెరుగైన మార్కెటింగ్ ,గిట్టుబాటు ధరలు పొందేవిధముగా కాటన్ మిషన్ ఏర్పాటు చేయడం,
అధిక దిగుబడులు నిచ్చే వంగడాల రూపకల్పన కు విత్తన జాతీయ మిషన్ ఏర్పాటు
మత్స్య సంపద అభివృద్ధికి మరింత చేయూత ఇవ్వటం ద్వారా రాష్ట్రములోని ఆక్వా రైతుల కు తోడ్పాటు కలిగిందని
కొత్తగా అస్సాం లో యూరియా ప్లాంట్ కు ఆమోదం ద్వారా యూరియా సరఫరా లో కొరతను తగ్గించే అవకాశం
మఖాన బోర్డు మరియు ఇతర పరోక్ష గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయించడం ద్వారా ప్రధాన మంత్రి  వికసిత భారత్ సాధన లక్ష్యం కు మరింత దగ్గరయ్యిందని వ్యాఖ్యానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *