-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్ )కు వచ్చు అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపుతూ రీఓపెన్ లేకుండా చూడాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువు లోపు నాణ్యతతో పరిష్కారం చూపుతూ , రీఓపెన్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీ జి ఆర్ ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి అని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డి ఆర్ ఓ నరసింహులు, తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు :
రెవెన్యూ -116, పంచాయతీరాజ్ -36, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ – 3, హౌసింగ్- 4, ఎస్సీ కార్పొరేషన్- 1, సర్వే శాఖ -10, సివిల్ సప్లైస్ -4, ఆర్టీసీ- 2, పోలీస్ – 11, విద్యుత్ శాఖ 4, మత్స్య శాఖ – 1, అటవీ శాఖ -1 మాత శిశు సంక్షేమ శాఖ -1, మున్సిపల్ శాఖ- 6, రూరల్ డెవలప్మెంట్- 2, పశుసంవర్ధక శాఖ -2, ఎండోమెంట్- 2, పరిశ్రమల శాఖ- 1, విద్యాశాఖ -2 , ఎక్సైజ్ -2, AP టౌన్షిప్- 1, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్- 1, డి ఆర్ డి ఎ పి డి -4, JNTU Anantapur -1, సాంఘిక సంక్షేమ శాఖ- 1, వ్యవసాయ శాఖ- 1 వెరసి మొత్తం 220 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News