Breaking News

ఎన్నికల ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేనందున వాయిదా నేపథ్యంలో రేపు మంగళవారం నిర్వహణ

-తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేనందున వాయిదా నేపథ్యంలో రేపు మంగళవారం నిర్వహణ : జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశం నిబంధనల మేరకు కోరం లేనందున వాయిదా పడిన నేపథ్యంలో రేపు మంగళవారం సదరు ఎన్నికల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ పేర్కొన్నారు. నేటి సోమవారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశం నిర్వహించగా నిబంధనల మేరకు కోరం లేనందున మంగళవారానికి వాయిదా వేయడం జరిగిందనీ, సదరు ప్రత్యేక సమావేశం రేపు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న నేపథ్యంలో సంబంధిత కౌన్సిలర్లు మరియు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 11 గం.ల కంటే ముందుగా సెనేట్ హాల్ నందు హాజరు కావాలని, సెల్ ఫోన్లు అనుమతి లేదని, రిలేటివ్స్ కు అనుమతి లేదని, ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకుని రావలసి ఉంటుందని జెసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *