-జిల్లాలో జనరల్ విద్యారులకు 124, ఒకేషనల్ విద్యారులకు 23 పరీక్ష కేంద్రాలలో నిర్వహణ
-ప్రాక్టికల్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 5 నుండి 20 వ తేది వరకు నిర్వహించనున్న జనరల్ / వోకేషనల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై డి ఆర్ ఓ నరసింహులు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ (జనరల్ ) రెండవ సంవత్సరo, మొదటి, రెండవ సంవత్సరo ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 5 నుండి 20 తేది వరకు జరగనున్నాయని ఈ పరీక్షల నిర్వహణ పగడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని తెలిపారు. ప్రతిరోజు రెండు షిఫ్ట్ లో ప్రాక్టికల్స్ జరుగుతాయని తెలిపారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి మధ్యహ్నం12 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ జరుగునున్నయని తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ 24927 మంది విద్యార్థులు 124 పరీక్ష కేంద్రాలు , ఒకేషనల్ 2355 మంది అభ్యర్థులకు 23 పరీక్ష కేంద్రాలలో ప్రాక్టికల్స్ నిర్వహణ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించే గదుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ పరీక్ష కేంద్రాల కు రవాణా శాఖ వారిచే రైల్వే మరియు బస్ స్టేషన్ ల నుండి బస్సు సౌకర్యములు ఏర్పాటు చేయడమైనది మరియు పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, గదులు, త్రాగు నీరు, లైటింగ్ తదితర మౌలిక వసతులు కల్పించాలని రవాణా శాఖ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు దృషి పెట్టాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతి లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పుత్తూరు రఘుపతి, చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్ రెడ్డి, పుత్తూరు బాలుర ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల రెడ్డి, చంద్రగిరి బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ రవి, విద్యుత్ శాఖ ఈ ఈ వాసవీలత, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News