గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ప్రణాళికాబద్దంగా కృషి చేసిన ఎన్నికల అధికారి, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఇతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటి ఎన్నికల అనంతరం గెలుపొందిన అభ్యర్ధులకు ధ్రవీకరణ పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లడుతూ గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటి ఎన్నికలకు జనవరి 16న నోటిఫికేషన్ విడుదల చేసి, ఎన్నికల అధికారిగా జిఎంసి అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ని నియామకం చేశామని తెలిపారు. అనంతరం షెడ్యుల్ మేరకు ఈ నెల 3వ తేదీ (సోమవారం) ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో ఓటింగ్ జరిగిందన్నారు. ఓటింగ్ లో 56 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని, తదుపరి 3 గంటల తర్వాత ఓట్ల లెక్కింపుని అభ్యర్ధుల సమక్షంలో చేపట్టామని తెలిపారు. ఫలితాల్లో వరుసగా 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ 33, 16వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ 32, 10వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మీరావలి 32, 46వ డివిజన్ కార్పొరేటర్ నూకవరపు బాలాజీ 31, 43వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు 31, 51వ డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి 30 ఓట్లు సాధించి, స్టాండింగ్ కమిటి సభ్యులుగా ఎన్నికయ్యారన్నారు.
పోటిల్లో ఉన్న 2వ డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి 24, 33వ డివిజన్ కార్పొరేటర్ గోపి శ్రీనివాస్ 24, 34వ డివిజన్ కార్పొరేటర్ రాజలత బూసి 24, 53వ డివిజన్ కార్పొరేటర్ ధూపాటి వంశీబాబు 23, 5వ డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ 23, 24వ డివిజన్ కార్పొరేటర్ అడకా పద్మావతి 1 ఓటు సాధించారని తెలిపారు.
స్టాండింగ్ కమిటి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, పోలీసు శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News