Breaking News

యుద్ధ ప్రాతిపదికన ఎ.కొండూరుకు సుర‌క్షిత కృష్ణా జ‌లాల సరఫరా పనులు

-జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధుల ప్ర‌భావిత 38 గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన సుర‌క్షిత కృష్ణా జ‌లాల‌ను అందించే తాగునీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఎ.కొండూరు, పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధుల‌ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 50 కోట్ల‌తో చేపట్టిన పనుల ప్రగతిని పరిశీలించేందుకు సోమవారం జిల్లా కలెక్టర్‌ డా. జి. ల‌క్ష్మీశా అధికారులతో కలిసి ఎ.కొండూరులో పర్యటించారు. ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్‌ స్థితిగతులతో పాటు దాదాపు 200 కి.మీ. మీటర్ల మేర పైపులైన్ల పనుల ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎ.కొండూరు మండ‌లంలోని 38 గ్రామాల్లో ఉన్న ఓవ‌ర్ హెడ్ ట్యాంకుల‌కు అద‌నంగా నిర్మిస్తున్న 14 ట్యాంకుల ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేసి నిర్దేశించిన ల‌క్ష్యంలోపు పూర్తిచేయాల‌ని సంబంధిత అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేశారు. క‌లెక్ట‌ర్ వెంట స్థానిక ఆర్‌డీవో కె.మాధురి, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగ‌ర్‌ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *