Breaking News

రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ప్రపోజ్ చేసిన ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్లను (Auxiliary Polling Stations) రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించి ఖరారు చేసినట్లైతే జాబితాను ప్రధాన ఎన్నికల అధికారికి పంపడం జరుగుతుందని కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ కోరారు.
సోమవారం కలక్టరేట్ లోని డిఆర్సి సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు , డిఆర్ఓ షేక్. ఖాజావలి , ఆర్డిఓ కె. శ్రీనివాస రావు లతో కలసి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు , ఏఆర్ఓ లు ( తహశీల్దారు ), మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ తరపున చిరతనగండ్ల వాసు , భారతీయ జనతా పార్టీ తరుపున చరక కుమార గౌడ్ , కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా (మార్సిస్ట్) వై కృష్ణకాంత్, తెలుగుదేశం పార్టీ తరుపున కంచర్ల శివరామయ్య , జనసేన పార్టీ తరపున గాదె వేంకటేశ్వర రావు , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున బిల్లా సునీల్ , అమ్ ఆద్ మీ పార్టీ తరపున టి. సేవా కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 118 ఎక్సిస్టింగ్ పోలింగ్ కేంద్రాలు వున్నాయని వాటిలో వెయ్యి ఓట్లకు పైన వున్న పోలింగ్ స్టేషన్లకు అదనంగా వేరొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయుటకు 39 పోలింగ్ కేంద్రాలను ప్రపోజ్ చేయడం జరిగిందన్నారు. ప్రపోజ్ చేసిన పోలింగ్ స్టేషన్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులు , ఏ ఆర్ ఓ లతో చర్చించి 8 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను తగ్గించడం జరిగిందన్నారు. దీని ప్రకారం జిల్లాలో 149 ( 118+31) పోలింగ్ స్టేషన్ల జాబితాను సిఈఓ కు పంపించడానికి ఏఆర్ఓ లు వెంటనే ప్రపోజల్స్ పంపాలని ఆదేశించారు. మిగిలిన ఏలూరు, కృష్ణ, యన్ టీ ఆర్ , బాపట్ల , పల్నాడు జిల్లాలో ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల వివరాలు అందిన పిదప కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి మొత్తం పోలింగ్ కేంద్రాలను ప్రకటించడం జరుగుతుందన్నారు. అలాగే నేటి వరకు నమోదు అయిన ఓటర్లలో పురుషులు 2,06,225 మంది , మహిళలు 1,40,344 మంది , ట్రాన్స్ జెండర్స్ 45 మంది మొత్తం 3,46,614 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు.

సమావేశంలో ఏఆర్ఓ లు , కలక్టరేట్ కో ఆర్డినేషన్ సెక్షన్ పర్యవేక్షకులు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *