Breaking News

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 10వ తారీకున జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా సోమవారం కలెక్టర్ గారి ఛాంబర్ నందు శ్రీమతి ఎస్. నాగలక్ష్మి, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గుంటూరు వారు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై రూపొందించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1 నుండి 19 సం. పిల్లలందరికి తప్పనిసరిగా నులిపురుగుల నివారణ కోసం 400 mg ఆల్బెండజోల్ బిళ్ళలను చప్పరించి మింగాలని , 1 నుండి 2 సం పిల్లలు అరమాత్ర, రెండు నుండి 19 సంవత్సరంల పిల్లలు పూర్తి మాత్ర మింగాలని తెలియజేశారు. పదవ తారీఖున మింగని పిల్లలను 17వ తారీఖున మాపప్ లో మింగించాలని, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గంట తేడాతో మాత్రలు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె విజయలక్ష్మి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, శ్రీమతి మజీద్ ఆ బేగం డిసిహెచ్ఎస్,ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ రోహిణి రత్నశ్రీ, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఏ శ్రావణ్ బాబు, డాక్టర్ సిహెచ్ రత్న మన్మోహన్, డాక్టర్ అన్నపూర్ణ,డాక్టర్ దాసరి శ్రీనివాసులు, శ్రీమతి విజయలక్ష్మి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్, శ్రీమతి రేణుక,జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్ బి ఎస్ కే సిబ్బంది, డైక్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *