-మారిటైమ్ బోర్డు చెర్మన్ దామచర్ల సత్యనారాయణ(సత్య)
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో వెస్ట్ ఎన్టీయే కూటమి నాయకుల సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి లో ఏ సమస్య వచ్చిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఒక ట్రబుల్ షూటర్ గా పనిచేస్తారు. ఎన్డీయే కూటమి బలపరిచిన కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు తథ్యం. అయితే భారీ మెజార్టీతో గెలిపించాలని వెస్ట్ నియోజకర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మారిటైమ్ బోర్డు చెర్మన్ దామచర్ల సత్యనారాయణ(సత్య) పిలుపునిచ్చారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సోమవారం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి నేతలతో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తారాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో పాటు ముఖ్యఅతిథిగా మారిటైమ్ బోర్డు చెర్మన్ దామచర్ల సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దామచర్ల సత్యనారాయణ(సత్య) మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా పదివేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేసినందుకు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఓటు నమోదు చేయించటం ఎంతో ముఖ్యమో ఆ ఓటర్ పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసే విధంగా కూడా చూడాలని సూచించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఆలాపాటి రాజేంద్రప్రసాద్ భారీ మెజార్టీ తో సాధించిన గెలుపు ఒక బహుమతి అందించాలన్నారు.తానకి భేషజాలు వుండవని, అందరితో కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన గెలుపు కాంక్షిస్తూ వెస్ట్ నియోజకవర్గం నుంచి పది వేల మంది గ్రాడ్యుయేట్స్ ను ఓటర్స్ గా నమోదు చేయించినందుకు ఎన్డీయే నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా 23 రోజుల మాత్రమే సమయం మిగిలి వుంది. వెస్ట్ లోని పదివేల మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎక్కడ వున్నారనే పూర్తి సమాచారం వుండాలన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు ప్రతి 30 మంది ఓటర్లుకు ఒక అబ్జర్వర్ ను పెట్టాలన్నారు. పది వేల మంది ఓట్లకు దాదాపు 300 మంది అబ్జర్వర్లను సిద్దం చేస్తే ఆ ఓటర్లు పూర్తి సమాచారం అందుతుందన్నారు. ఈ నెల 7వ తారీఖు నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తేడా వుంటుందని, ఓటర్లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.
అనంతరం సభాధ్యక్షుడు బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి ఆలాపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి భారీ మెజార్టీ సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మాద్ ఫతావుల్లా, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్ లతోపాటు పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News