విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ విద్యార్థుల నాయకత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్, ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మరియు జియన్ఆర్ ఎమ్ సి పాఠశాలలోని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆఫీస్ షేక్ అహ్మద్, జి యన్ ఆర్ ఏమ్ సి పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్, సుజనా ఫౌండేషన్ ఆపరేషన్స్ హెడ్ వీరమాచనేని కిరణ్ ప్రతిజ్ఞ చేయించారు. నేను నాకోసం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని పట్టుదలతో దానిని సాధిస్తానని, అవకాశాలను సృష్టించుకుని విఫలతల నుండి నేర్చుకొని నా జీవితంలో విజయం సాధిస్తానని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటానని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పైలా సురేష్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News