Breaking News

మూడేళ్ల‌లో ఎస్.ఎస్.టి.టి.పి ప్రోగ్రామ్ కింద శిక్ష‌ణ పొందిన వారి సంఖ్య 57,151 మంది

-కేంద్ర కార్మిక , ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్ల‌డి
-దత్తోపంత్ తెంగడి నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ (DTNBWED) పథకం పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దత్తోపంత్ తెంగడి నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ (DTNBWED) ప‌థ‌కం ద్వారా గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో (2022-2025) మొత్తం 16,75,199 మంది కార్మికులు శిక్షణ పొందారు.ఇందులోని స్పాన్సర్డ్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (SSTTP) ద్వారా 57,151 మంది శిక్ష‌ణ తీసుకున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం శిక్ష‌ణ పొందినవారి ఉపాధి స్థితిని ట్రాక్ చేయ‌డం లేద‌ని, భవిష్యత్తులో శిక్షణ పొందే వారి ఉపాధి స్థితిని ట్రాక్ చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర కార్మిక , ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్ల‌డించారు.

దత్తోపంత్ తెంగడి నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ (DTNBWED) పథకం లోని ఎస్.ఎస్.టి.టి.పి ద్వారా గ‌త ఐదేళ్ల‌లో శిక్ష‌ణ పొందిన వారి వివ‌రాలు రాష్ట్రాల వారీ కావాల‌ని, ఈ ప‌థ‌కంలోని వివిధ విభాగాల‌కు కేటాయించిన మొత్తం బ‌డ్జెట్ కేటాయింపు వివ‌రాలు , భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌నున్న శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు తెలియాజేయాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కేంద్ర కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ ను లోక్ స‌భ‌లో సోమ‌వారం అడ‌గ‌టం జ‌రిగింది. వీటికి కేంద్ర కార్మిక , ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు.

ఎస్.ఎస్.టి.టి.పి అనేది ట్రేడ్ యూనియన్లు, ఎన్.జి.వో లు, ఇండస్ట్రీ అసోసియేషన్లు, కామర్స్ ఛాంబర్లు, కాంట్రాక్టర్లు, మైనింగ్ సంస్థలు అవసరాలను బట్టి రూపొందించిన డిమాండ్-బేస్డ్ ప్రోగ్రామ‌ని. ఈ ప్రొగ్రామ్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిన‌ట్లు తెలిపారు. ఈ పథకానికి (DTNBWED) ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ. 5000 కోట్లకు పైగా కేటాయించగ్గా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 1032.6 కోట్ల బడ్జెట్ కేటాయించిన‌ట్లు పేర్కొన్నారు.

2022-2025 మధ్య కాలంలో ఎస్.ఎస్.టి.టి.పి కింద ఆంధ్రప్రదేశ్‌లో2022-23లో 5100 మంది 2023-24లో 900 మంది శిక్ష‌ణ పొందిన‌ట్లు తెలిపారు. ఈ పథకాన్ని ( DTNBWED) మరింత విస్తరించేందుకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించిన‌ట్లు తెలిపారు.. త్వరలో ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కార్మికుల శిక్షణను మరింత మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న ఈ చర్యలు, దేశవ్యాప్తంగా లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *