ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో తేదీ.30-01-2025, మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ దశమి, తేది 07-02-2025 వరకు శ్రీ శ్యామల నవరాత్రి ఉత్సవాలు ఆగమోక్తముగా జరిగినవి. ఇందులో భాగముగా ఈరోజు 07-02-2025 న ఉదయం 9-30 గం లకు యాగశాల నందు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో కార్యక్రమం పూర్తి అయినది. ఈరోజు ఈ పూర్ణహుతి కార్యక్రమం నందు ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు గారు పాల్గొన్నారు. దేవస్థానం నందు ఆలయ వేదపండితులు, అర్చక సిబ్బందిచే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రీ శ్యామల పంచక మంత్రములు, హోమములు మరియు మండప పూజలు నిర్వహించారు.
Prajavartha Online Telugu News